సాధారణంగా.. సినీ రంగంలో ఉండేవారు.. పేరుతోనే పిలుచుకుంటారు. పిలిపించుకుంటారు కూడా. ఎక్కడో చాలా అరుదుగా మాత్రమే.. వరసలు పెట్టుకుంటారు. ఇక జూనియర్లయితే.. అన్నగారు.. సార్.. అని పిలుస్తారు. కానీ, సమకాలికులు.. హీరోయిన్లు ఇప్పుడైతే.. హీరోను సార్అని సంబోధిస్తున్నారు కానీ, గతంలో బ్లాక్ అండ్ వైట్ కాలంలో మాత్రం హీరోను.. హీరోయిన్లు.. హీరోయిన్లను.. హీరోలు.. చిలిపి మాటల తో పిలుచుకునేవారు.. ఒకరకంగా.. ఆటపట్టించుకునేవారు.
అక్కినేని నాగేశ్వరరావును.. హీరోయిన్లు.. అందరూ.. “హీరోగారు“ అని పిలిచేవారు. సీనియర్లయినా.. జూని యర్లయినా.. ఇదే పిలుపుతో ఆయనను పిలిచేవారు. కానీ, అన్నగారి విషయానికి వస్తే.. మాత్రం.. అందరికి భయం! ఆయన స్పాట్‌కు వస్తున్నారంటే.. అందరూ అలెర్ట్ అయిపోయారు. అయితే.. ఇది తర్వాత.. మాట. కానీ, ముందు.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మాత్రం.. అప్పటి దిగ్గజ దర్శకులు.. నిర్మాతలు మాత్రం.. “ఎన్టీఆర్“ అని పిలిచేవారు.
నిర్మాతకు గౌరవం ఇవ్వాలనే దిషయాన్ని దిగ్గజ దర్శకుడు కేవి రెడ్డి నుంచి.. ఎన్టీఆర్ నేర్చుకున్నారు. ఆయన చాలా స్ట్రిక్టు. ముందుగా.. స్టూడియోకు రాగానే (అప్పట్లో దర్శకులకు, హీరోలకు కూడా కార్లు ఉండేవి కాదు. స్టూడియోల నుంచి కార్లు పంపించి.. తీసుకువచ్చేవారు) కేవీ రెడ్డి నేరుగా నిర్మాత ఉన్న రూంకు వెళ్లేవారు. ఆయనకు నమస్కారం పెట్టి.. స్క్రిప్టు తీసుకుని.. షూటింగ్ స్పాట్‌కు వెళ్లేవారు. ఇదే అలవాటు అన్నగారికి వచ్చింది.
ఇక, ఒక్క తాతినేని రామారావు “రామారావుగారు“ అని, కమలాకర కామేశ్వరరావు అయితే.. “దొంగ రాముడు“ అని పిలిచేవారు. విఠలాచార్య మాత్రం..“రామారావు సర్“ అని చాలా చాలా గౌరవం ఇచ్చి పిలిచేవారు. దాసరి నారాయణ రావు.. తొలిసారి.. ఎన్టీఆర్‌ను `అన్నగారు`గా పిలిచారు. ఇదే తర్వాత.. కాలంలో బాగా దూసుకుపోయింది. మోహన్‌బాబు అయితే.. “చెప్పండి సర్..“ అని అనేవారు. రాఘవేంద్రరావు.. “రామారావుగారు“ అని అనేవారు. ఇలా.. అన్నగారి విషయంలో ఎవరి అభిమానం వారు చూపించేవారు.