Moviesఆ నొప్పి భరిస్తేనే హీరోయిన్ అవ్వగలరు..సంచలన విషయాని బయటపెట్టిన రష్మిక ..!!

ఆ నొప్పి భరిస్తేనే హీరోయిన్ అవ్వగలరు..సంచలన విషయాని బయటపెట్టిన రష్మిక ..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడమే గొప్ప విషయం. మరి వచ్చిన అవకాశాలన్ని ఉపయోగించుకుని..స్టార్ హీరోయిన్ గా మారడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో పట్టుదల ..ఓర్పు..కష్టం కావాలి. హీరోయిన్స్ కి అయితే..గ్లామర్ కూడా కావాలి. ఈ రంగుల ప్రపంచంలో అందగా లేకపోతే పైకి రానివవ్వరు. వచ్చిన ఎంకరేజ్ చేయరు..తొక్కేస్తారు. ఇవన్ని కాదు..ఇండస్ట్రీలోకి రావలంటే ఆ నొప్పిని భరించాల్సిందే అంటూ బిగ్ బాంబ్ పేల్చింది పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక.

ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ కన్నడ బ్యూటి. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అమ్మడు లైఫ్ ఇంతగా మారిపోవడానికి కారణం సుకుమార్ తెరకెక్కించిన “పుష్ప” సినిమానే. అంతకముందు కూడా అమ్మడుకి అవకాశాలు వచ్చేవి..కన్నీ, ఇప్పుడు బిగ్ బడా స్టార్స్ సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. రెమ్యూనరేషన్ కూడా బారీ స్దాయిలోనే అందుకుంటుంది. అయితే, పుష్ప సినిమా కోసం అమ్మడు చాలా కష్టపడిందట. ఈ విషయాని ఆమె చెప్పుకొచ్చింది.

ఆ సినిమా లో డీ గ్లామర్స లుక్ కోసం ఆమెకు నల్ల మేకప్ వేసారట. లంచ్ బ్రేక్ లో హ్యాండ్ వరకే వాష్ చేసుకుని జాగ్రత్తగా ఫుడ్ తినేసి..మళ్ళీ బ్లాక్ మేకప్ వేసేవారట. అలా ఇంటికి వెళ్ళి మేకప్ తీసాక ఫేస్ వాష్ చేసిన, హ్యాండ్ వాష్ చేసిన భగభగ మండిపోయేదట. ఆ తరువాత ఆ ప్లేస్ లో వాక్స్ చేసిన..క్రీమ్ అప్లై చేసిన బాగా నొప్పిగా అనిపించేదట. కష్టంగానే ఉన్న ఇష్టమైన దానికోసం కష్టపడక తప్పదు..మీరు ఇలాంటి నొప్పి ని భరిస్తాము అనుకుంటేనే ఇండస్ట్రీలోకి రండి”..అంటూ ఓ పోస్ట్ చేసింది. ఇది అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ప్రజెంట్ రష్మిక 9 ప్రాజెక్ట్స్ చేతిలో పట్టుకుని టాప్ హీరోయిన్ లిస్ట్ లో ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news