Moviesరాశీఖన్నాతో మారుతికి అలాంటి రిలేషన్ ఉందా... ఆమె కోసం ఏం చేస్తున్నాడంటే..!

రాశీఖన్నాతో మారుతికి అలాంటి రిలేషన్ ఉందా… ఆమె కోసం ఏం చేస్తున్నాడంటే..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్‌కి ఎవరో ఒకరి అండ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఎంత టాలెంట్ ఉన్నా అడ్రస్ లేకుండా పోతుంది. హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడో..నిర్మాతనో లేక పెద్ద హీరోనో హీరోయిన్‌ని ఎంకరేజ్ చేస్తూ లాక్కురావాలి. ఇది ఇప్పటి సాంప్రదాయం కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఉన్నదే. అయితే, అప్పట్లో క్రేజ్ వల్ల తమ సినిమాలో ఈ హీరోయిన్ మాత్రమే కావాలనే పట్టుదల ఉండి..కొన్ని రోజులు ఎదురు చూసైనా అనుకున్న వారిని నటింపజేశారు.

ఇప్పుడు అన్నీ పద్ధతులు పరిస్థితులు మారిపోయాయి. అంతా కమర్షియల్ అయిపోయింది. చాలా మంది దర్శకులు – హీరోయిన్ మధ్య నీకేంటి నాకేంటి..పనేటి అని కాస్త పోకిరి సినిమాలో డైలాగ్‌ను ఆపాదించి మాట్లాడుతున్నారు. అందుకే, సినిమా హిట్ అయినా ఫ్లాపైనా దర్శకులు ఎలాగోలా నిర్మాతలను – హీరోలను కన్విన్స్ చేసి చేయి పట్టుకొని ఉన్న హీరోయిన్‌నే ప్రాజెక్ట్‌లోకి దింపుతున్నారు. దీనికి ఉదారహరణ కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

అడ్రస్ లేకుండా పోవాల్సిన పూజా హెగ్డేను హరీష్ శంకర్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ స్టార్ హీరోయిన్‌లా మార్చారు. సమంత టాలెంటెడ్ కాబట్టి అందరు దర్శకులు తనని వదలడం లేదు. సమంత కూడా కెరీర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి తనకోసం కొత్త దర్శకులు వచ్చిన కూడా డేట్స్ సర్దుబాటు చేసి సినిమా చేస్తుంది. కమర్షియల్ అయినా సమంతలో ఓ నిబద్దత ఉంటుంది. తన కోసం స్టార్ హీరోలు మాత్రమే రావాలి.. అగ్ర దర్శకులు వస్తేగానీ సినిమా చేయను అనే సమాధానాలు ఇవ్వదు.

తెలుగులో రాశీఖన్నా కూడా చాలామంది దర్శకులతో బాగా కలిసిపోతుంది. ఆ లిస్ట్‌లో దర్శకుడు మారుతీ కూడా ఉన్నాడు. ప్రతిరోజు పండగే సినిమాలో రాశీని హీరోయిన్‌గా తీసుకున్న మారుతి మంచి రోల్ రాశారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర బాగా హైలెట్ అయింది. ఆడియన్స్ కూడా బాగా ఆదరించారు. అదే కంటిన్యూ చేస్తూ గోపీచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారు. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది.

అయినా కూడా మరో సినిమా ఇవ్వడానికైనా మారుతి రెడీగా ఉన్నారట. రాశీ కూడా తెలుగులో ఇప్ప‌టికే ఫేడ‌వుట్‌కు ద‌గ్గ‌ర్లో ఉంది. మారుతి ఏమైనా చేయి ఇస్తే మరి దానిని అంది పుచ్చుకుని అయినా పైకి వెళుతుందేమో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news