కొన్ని కొన్ని విషయాల్లో.. మాకు వారు ఆదర్శం.. మాకు వీరు ఆదర్శం.. అంటూ.. చాలా మంది చెబుతూ ఉంటారు. వారి స్ఫూర్తితో ఆయా రంగాల్లో ముందుకు సాగుతారు కూడా. అయితే.. కొన్ని కొన్ని విషయాలు గమనిస్తే.. ఔనా.. నిజమేనా.. ఇలా జరుగుతోందా ? అనే చర్చ సాగుతోంది. తాజాగా సీనియర్ నటి.. జయసుధ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. తెలుగు, తమిళ సినీ రంగాలను పరిశీలిస్తే.. సీనియర్ నటి ఎవరైనా ఉంటే ఆమె.. మహానటి సావిత్రి..!
ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. తెలుగు సినీ రంగంలో ఆమె ఎప్పటకీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా తన పాత్రలకు ప్రాణం పోసేశారు. తనకు తిరుగులేదనే విధంగా ఆమె చరిత్రసృష్టించారు. తన తర్వాత.. వచ్చిన వారికి ఎంతో ఆదర్శమైన నటనను అందించారనే చెప్పాలి. పాత్ర ఏదైనా.. ఒదిగిపోవడం.. ఎలాంటి పాత్రనైనా.. అల వోకగా చేయడం… వంటివి సావిత్రి నుంచే నేర్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే.. దీనికన్నా .. ఎక్కువ గా.. ఒక విషయంలో ఆదర్శమనే మాట వినిపిస్తుండడంపై సావిత్రి అభిమానులు కలత చెందా రు.
తాజాగా జయసుధ మాట్లాడుతూ.. “సావిత్రి గారి నుంచి మేం ఒక విషయాన్ని నేర్చుకున్నాం“ అన్నారు. దీంతో మహానటి అభిమానులు ఎంతో ఉత్సాహపడ్డారు. ఆమె గురించిన మరేదైనా విషయం చెబుతారేమో అని అనుకున్నారు. అయితే.. దీనికి భిన్నంగా.. జయసుధ మాట్లాడారు. మహానటికి ఉన్న చెడు వ్యసనం.. మందు తాగడం విషయంలో మేం ఆమె నుంచి అనేక విషయాలు తెలుసుకుని.. దానికి దూరంగా ఉన్నా మని.. వ్యాఖ్యానించారు జయసుధ. ఇది.. మహానటి అభిమానులు హర్ట్ అయ్యేలా చేసింది.
వాస్తవానికి మహానటిలో అనేక మంచి లక్షణాలు ఉన్నాయి. ఉదారమైన దానం గుణం ఉంది. అలవోకగా.. ఏ భాషలో అయినా.. డైలాగులు చెప్పగల నేర్పరితనం ఉంది. షూటింగ్ సమయాల్లో ఉత్సాహంగా తిరిగే లక్షణం కూడా ఉంది. డబ్బులతో ముడిపెట్టకుండా.. సినిమాను వ్యాపార మయం చేయని.. లక్షణమూ ఉంది. కానీ, ఇన్ని ఉన్నా.. అన్నింటినీ వదిలేసి.. ఒక్క మద్యపానమే..తమకు కనిపించిందని.. జయసుధ వ్యాఖ్యానించడంపై.. మహానటి అభిమానులు నొచ్చుకోవడం గమనార్హం.