లైగర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మార్మో మ్రోగిపోతుంది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డైరెక్ట్ చేసిన సినిమానే ఈ లైగర్.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో విజయ్ దేవరకొండ , చార్మి, కరణ్ జోహార్, అనన్య పాండే, పూరి జగన్నాథ్ ఫుల్ బిజీగా మారిపోయారు .
సినిమా రిలీజ్ కి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ ని మరింత స్పీడ్ అప్ చేశారు లైగర్ టీం. అయితే అనుకోకుండా “బాయ్ కాట్ లైగర్” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని పలువురు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ VS యాంటీ విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ మదలైంది. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు బాయ్ కాట్ లైగర్ కు కారణమయ్యాయి. ఈ మధ్యనే రిలీజ్ అయిన లాల్ సింగ్ చద్ద సినిమా టైంలో అమీర్ ఖాన్ ఎదుర్కొన్న సేమ్ ప్రాబ్లం ని ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎదుర్కొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ “అమీర్ ఖాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలి అనడం దారుణం” అంటూ ఆయన మాట్లాడారు.
అయితే తాజాగా బాయ్ కాట్ లైగర్ హ్యాష్ టాక్ ట్రెండింగ్ పై విజయ్ దేవరకొండ స్పందించారు. “సినిమాను ఆపేస్తారా ఆపేసుకోండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ..” ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. కావాలనే నన్ను కొందరు తొక్కేయాలని చూస్తున్నారు . ఎవ్వరు ఏమి అనుకున్నా నాకు పర్లేదు .నాకు ప్రాబ్లం లేదు. నేను నా విషయానికి క్లియర్ గా ఉన్నాను. అందరూ సినిమాని ఆపేస్తాము బాయ్ కాట్ చేస్తాం అంటున్నారు. ఒక సినిమా మీద వేలాది కుటుంబాల ఆధారపడి ఉంటాయని వాళ్లకు తెలియదు, ఇక బాయ్ కాట్ విషయానికి వస్తారా బాయ్ కాట్ చేస్తారంటే చేయండి. థియేటర్స్ లో చూసేవాళ్ళు థియేటర్స్ లో చూస్తారు. ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఓటిటిలో చూస్తారు. అంతకుమించి మేమేం చేయలేం..” అంటూ ఘాటుగా స్పందించిన్నత్లు తెలుస్తుంది. దీంతో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.