Moviesబాల‌య్యకు ' బి.ఏ ' చ‌ద‌వ‌డం ఇష్టంలేదా... ఇంట‌ర్‌తో ఎందుకు ఆపేయాల‌నుకున్నారు...!

బాల‌య్యకు ‘ బి.ఏ ‘ చ‌ద‌వ‌డం ఇష్టంలేదా… ఇంట‌ర్‌తో ఎందుకు ఆపేయాల‌నుకున్నారు…!

ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా రంగంతో… తెలుగు ప్రజలతో అనుబంధం.. ఆయన తెరపై కనిపిస్తే చాలు ఓ సంచలనం. ఆయన సినిమా అంటేనే ఒక ప్రభంజనం. మాసైనా… క్లాస్ అయినా ఆయన తెరమీద కనిపిస్తే జై బాలయ్య అని అరవాల్సిందే. ఆయనకు అభిమాని కావాల్సిందే. బాలయ్య డైలాగ్ చెప్పారంటే అడవిలో సింహం గర్జించినట్టే ఉంటుంది. అందుకే బాలయ్యను నట‌సింహం అంటారు. ఇటీవలే బాలయ్య 62వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బాలయ్య పాత్ర ఏదైనా కథ ఎలాంటిదైనా అందులో ఒదిగిపోయి ఆ పాత్రలో జీవించేస్తారు. నూటికి నూరు శాతం తన వృత్తిపరంగా నిబద్దతను చాటుకొనే అతి తక్కువ మంది సినీనటుల్లో బాలయ్య కూడా ఒకరు. ఈ క్రమశిక్షణ అంతా బాలయ్య తన తండ్రి నందమూరి తారక రామారావు నుంచి అందిపుచ్చుకున్నారు. బాలయ్య హీరో అవటానికి ముందు 14 ఏళ్ల వయసులోనే తన తండ్రి దర్శకత్వం వహించిన తాతమ్మక‌ల సినిమాతో తొలిసారిగా వెండితెరపై కనిపించారు. బాలయ్య బాల్యం అంతా హైదరాబాదులోనే గడిచింది.

ఆయన నిజాం కాలేజ్ రోడ్డు డిగ్రీ చదివారు. వాస్త‌వానికి చిన్నప్పటి నుంచే బాలయ్య తండ్రిని చూసి సినిమా రంగంపై మక్కువ పెంచుకున్నారు. ఆరంభంలో సహాయ నటుడిగా అనేక సినిమాలలో కనిపించారు. వాటిలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించిన సినిమాలే ఎక్కువ..! బాలయ్య హీరో కాకముందు తాతమ్మకల – దానవీరశూరకర్ణ – అక్బర్ సలీం అనార్కలి – శ్రీ మద్దిరాట్ పర్వం – తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలలో నటించారు.

బాల‌య్య‌కు డిగ్రీ చ‌ద‌వ‌డం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇంట‌ర్ పూర్త‌వ్వ‌డానికి ముందు నుంచే ఆయ‌న సినిమాల్లోకి వ‌చ్చేశారు. ఇంట‌ర్ పూర్త‌యిన వెంట‌నే ఆయ‌న సినిమాలు చేయాల‌ని అనుకున్నారు. అయితే క‌నీసం డిగ్రీ అయినా ఉండాల్సిందే అని ఎన్టీఆర్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ నిజాం కాలేజ్‌లో జాయిన్ చేశారు. బి.ఏ పూర్తి చేశాక బాల‌య్య సినిమాల్లో కంటిన్యూ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news