సినీ జీవితంలో అనేక సంచలనాత్మక చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్.. చరిత్ర సృష్టించిన విషయం తెలిసిం దే. దాదాపు ఆయన వేయని పాత్ర అంటూ ఏదీలేదు. రాముడిగా, కృష్ణుడిగానేకాకుండా.. ప్రతినాయక పాత్రలైన రావణుడిగా కూడా ఆయన మెప్పించారు. ఇక, సాంఘిక సినిమాలకు వస్తే.. కౌబాయ్ నుంచి ఉపాధ్యాయుడి వరకు, రౌడీ నుంచి పోలీస్ వరకు.. న్యాయమూర్తి నుంచి లాయర్ దాకా అన్నగారు పోషించని పాత్ర లేదు. అయితే.. కొన్ని కొన్ని అసంతృప్తులు కూడా ఉన్నాయి.
అన్నగారు.. పలు చిత్రాల్లో భక్తుడిగా కూడా నటించారు. ఉదాహరణకు పాండురంగ మహత్యం సినిమాలో అపర భక్తుడిగా ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే.. కొన్ని కొన్ని చిత్రాల్లో ఇలాంటి అవకాశం వచ్చినా.. నిర్మాతలు దర్శకులు ఎదురు చూసినా.. అన్నగారు చేజార్చుకున్న అవకాశాలు కూడా ఉన్నా యి. ఇలాంటి వాటి గురించి.. అన్నగారు పెద్దగా బాధపడింది లేదు..కానీ, ఒకే ఒక సినిమా గురించి మాత్రం కొంత ఆవేదన చెందారని అంటారు సినీ క్రిటిక్స్.
అదే.. అక్కినేని నటించిన `భక్త తుకారాం` సినిమా. ఈ సినిమాను దుక్కిపాటి మధుసూధనరావు.. డైరెక్ట్ చేశారు. ఇది డైరెక్ట్ సినిమా కాదు.. డబ్బింగ్ కథతో తీసిన సినిమా. ఆదిలో అన్నగారికే ఈ మూవీలో అవకాశం దక్కింది. అయితే..అప్పటికే ఆయన బిజీగా ఉండడంతో కుదరదని చెప్పారు. కానీ, మూడు మాసాల వరకు మధుసూదనరావు.. ఎదురు చూశారు. పైగా అంజలీదేవి.. కూడా నటిస్తున్నారని.. మంచి పేరు కూడా వస్తుందని.. చెప్పారు. అయితే.. చూద్దాం.. చేద్దాం.. అని అన్నగారు బదులిచ్చారు. అయితే.. నిర్మాత తొందర పెడుతుండడంతో అక్కినేనిని సంప్రదించగా.. ఆయన వెంటనే ఓకే చెప్పారు.
దీంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లిపోవడం.. అప్ప ట్లోనే కేవలం నాలుగు మాసాల్లో ఈ సినిమా పూర్తి కావడం గమనార్హం. వాస్తవానికి ఏం ఆడుతుందిలే.. అనుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది.ఈ సినిమా హిట్ అప్పట్లో నాగేశ్వరరావుకు బాగా కలిసొచ్చింది. దీంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట ఆయన. ఈ విషయం తెలిసిన అన్నగారు.. ఒకింత ఆవేదన చెందారు. మంచి సినిమా.. సందేశాత్మక సినిమాను చేజార్చుకున్నానే అని అనేవారట. అయితే.. తన తోటి నటుడు అక్కినేనిని మాత్రం అభినందించకుండా ఉండలేక పోయారు. ఆ తర్వాత.. ఏ చిత్రం వచ్చినా.. అన్నగారు కాదనకుండా చేయడం గమనార్హం.