టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మరీ ముఖ్యంగా ఆయనతో కలిసి కనీసం ఒక్క సీన్‌లో అయినా… అదీ కుదరకపోతే ఒక్క షాట్‌లో అయినా కనిపించాలని తహ తహలాడే నటీనటులెందరో ఉన్నారు. ఇక ఆయన సరసన నటించాలని కొన్నేళ్ళుగా కలలు కనే హీరోయిన్స్ తోటి నటులు లేకపోలేదు. ఇప్పుడు భారీ మల్టీస్టారర్ సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో చాలామంది సీనియర్ నటులు, యంగ్ హీరోలు ఆయనతో కలిసి స్క్రీన్ మీద కనిపించాలని ఎదురు చూస్తున్నారు.
కొందరు హీరోయిన్స్ అయితే, మాస్ మసాలా సాంగ్‌లో మెగాస్టార్‌తో కలిసి కాలు కదిపే అవకాశం వస్తే అందాల ఆరబోతకు సై అంటూ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. అయితే, చిరంజీవి సినిమాలో నటిస్తే క్రేజ్ కంటే కూడా ఓ డ్రీం నెరవేరిందని భావించేవారున్నారు కూడా. అన్నిటికంటే మరో ఆలోచన ఉన్నవారు ఉన్నారు. హీరోయిన్‌గా ఫేడవుట్ అయిన రెజీనా లాంటి వారికి ఓ ఐటెం సాంగ్ వస్తే దశ తిరుగుతుందని ఆరాటపడేవారు ఇప్పుడున్నారు.
సంగీత లాంటి వారు ఒక్క సాంగ్ చిరంజీవి సినిమాలో చేస్తే అదో మైల్ స్టోన్‌ని చేరుకున్నట్టే అనుకుంటున్నారు. కానీ, అందరికీ మెగాస్టార్ సినిమాలలో అవకాశం దక్కడం లేదు. దక్కిన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు రావడం లేదు. దీనికి ఉదాహరణ ఏవో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఆచార్య సినిమా చాలు. ఈ సినిమాలో ముందు కాజల్ అగర్వాల్ హీరోయిన్. షూటింగ్ కూడా చేశారు.
ఫైనల్ కట్‌లో కాజల్‌ని కట్ చేశారు. ఇది సరే అనుకుంటే, రెజిన్నా అవకాశాల కోసం చూస్తున్న తరుణలో ఆచార్యలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్. ఇదే ఛాన్స్ సంగీతకి కూడా వచ్చింది. ఒకరికి మసాలా సాంగ్, ఒకరికి క్లాసికల్ సాంగ్. ఇద్దరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆహా మెహాస్టార్ సినిమా కదా. ఎంతో కొంత క్రెడిబులిటీ దక్కుతుందని.. తమకు ఆ తర్వాత మంచి పాత్రలు వస్తాయని అనుకున్నారు.
చివరికి ఆచార్య అట్టర్ ఫ్లాపవడంతో ఆయన మీద, ఆచార్య సినిమా మీద ఫెట్టుకున్న ఆశలన్నీ సంగీత, రెజీనాలకి గల్లంతయ్యాయి. అసలు ఆచార్యలో వీరున్నారా..ఎక్కడా..? అను అనుమానం కలుగుతుంది కూడా. అంటే అసలు వీరు ఏ మాత్రం ఐడెంటీ అవ్వలేకపోయారు. అసలు వీరిని ఎవ్వరు గుర్తు కూడా పెట్టుకోలేదు.