ఈ విషయం విన్న ఎవ్వరైన షాక్ అవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. తన నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం నేనే అంటూ ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. మనకు తెలిసిందే..రష్మిక సినిమాలోకి వచ్చే ముందే రక్షిత్ శెట్టి అనే అబ్బాయితో నిశ్చితార్ధం చేసుకుంది. కానీ, అనుకోని విధంగా ఆ ఎంగేజ్మెంట్ ని బ్రేకప్ చెప్పుతూ..అతని వదిలేసింది. అస్సలు వీళ్ళు ఎందుకు విడిపోయారా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
రక్షిత్ శెట్టితో రష్మిక బ్రేకప్ తరువాత..వరుసగా మంచి మంచి హిట్ సినిమాలను అందుకుంటూ..టాప్ పోజీషన్ లో ఉంది. అయితే, తాజాగా ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..”రష్మిక కి తన ప్రియుడు నుండి విడిపో మని చెప్పింది నేనే . ఎందుకంటే వాళ్ళ జాతకాలు కలవలేదు. ఇద్దరు పెళ్ళి చేసుకున్నా..డివర్స్ వరకు వెళ్తుంది. పైగా రష్మిక జాతకం చాలా బాగుంది. అమె ఖచ్చితంగా ఇండస్ట్రీని ఏలేసే హీరోయిన్ అవుతుంది అని నాకు తెలుసు..అందుకే చెప్పాను..”అంటూ బిగ్ బాంబ్ పేల్చారు.
వేణు స్వామీ తాజా వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో కొత్త డౌట్లు మొదలైయేలా చేసింది. ఇప్పటికే , సమంత నాగ చైతన్య విడిపోతారని ముందే చెప్పిన ఆయన నయనతార జాతకంలోను.. విడాకులు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయని కూడా చెప్పారు. ప్రభాస్ జాతకంలోను పెళ్లి యోగం లేదన్నట్లే అని చెప్పుకొచ్చారు. ఇలా షాకిమ్హ్ విషయాలను చెప్పే వేణు స్వామీ..రేపటి రోజు మేరే జంట గురించిన బ్యాడ్ న్యూస్ చెప్తారో అని టెన్షన్ పడుతున్నారు.