Moviesక‌ళ్యాణ్‌రామ్ ' బింబిసార‌ ' పై ఎన్టీఆర్ రివ్యూ.... ఎలాంటి రిపోర్ట్...

క‌ళ్యాణ్‌రామ్ ‘ బింబిసార‌ ‘ పై ఎన్టీఆర్ రివ్యూ…. ఎలాంటి రిపోర్ట్ ఇచ్చాడంటే..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యువ దర్శకడు వశిష్ట్ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బింబిసార‌. గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గ్రాండియర్ విజువల్ సోషియో ఫాంటసీ మూవీగా బింబిసార ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా సంయుక్తా మీనన్, క్యాథరీన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ భారీ బ‌డ్జెట్‌తో ఈ బింబిసార‌ను నిర్మించారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ క్రీస్తు శ‌కం 5వ శ‌తాబ్దానికి చెందిన మ‌గ‌ధ సామ్రాజ్యాధినేత‌గా న‌టిస్తున్నాడు. త్రిగర్తల రాజ్యాధిపతి బింబిసారుడి పాత్రతో పాటు ఇటు 2022లో ఉండే యువ‌కుడిగా కూడా కూడా న‌టించాడు. ఈ రెండు పాత్ర‌ల‌కు ఉన్న లింక్ ఏంట‌న్న‌దే ఈ సినిమా స్టోరీ.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన‌ ఈశ్వరుడే అనే పల్లవితో సాగె ఎమోషనల్ సాంగ్, థియేట్రీకరల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెంచేసాయి. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న బింబిసార‌ సినిమా ప్రివ్యూ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా వీక్షించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటు దర్శకుడు వశిష్ట్‌.. మిగిలిన సినిమా యూనిట్ పై ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

ముఖ్యంగా కళ్యాణ్ రామ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తే… దర్శకుడు వశిష్ట్ మూవీని విజువల్ గ్రాండియర్ గా… ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించార‌ని… ఈ సినిమా రిలీజ్ అయిన‌ తరువాత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయం అని అన్నారట. ఇక కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాను రు. 37 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తరికెక్కిన సినిమాగా బింబిసార‌ రికార్డులకు ఎక్కింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news