లావణ్య త్రిపాఠీ .. ఇండస్ట్రీలో ఈ పేరుకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అందాల రాషసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తరువాత మెల్ల్గా మెల్లగా మంచి ఆఫర్స్ అందుకుంటూ..తన్ స్దాయిని పెంచుకుంటూ పోయింది. అంతేనా..ఏకంగా మెగా హీరో లతో నటించే ఛాన్సులు అందుకుంది. ఆ పరిచాయని అలా స్నేహంగా..ఆ తరువాత ప్రేమగా మార్చుకుంది అంటూ ఓ రూమర్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ప్రజెంట్ లావణ్య “హ్యాపీబర్త్ డే” అనే చిత్రంతో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా గ్రాండ్ గా జులై 8న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో ముచ్చతించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తూ..పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది లావణ్య త్రిపాఠి. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ ఆన్సర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అక్కినేని నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో లావణ్య రామ్ పాత్రలో ఉన్న నాగ్ కి భార్య గా సీత పాత్రలో నటించింది. తన క్యూట్ నటనతో అలరించింది. అయితే, ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాలో మాత్రం అమ్మడు పాత్ర ఎగిరిపోయింది. దాని గురించి లావణ్య ను ప్రశ్నించగా..అమ్మడు షాకింగ్ రిప్లై ఇచ్చింది.
“నాగార్జున ఈ సినిమా విషయంలో నా దగ్గరకు వచ్చి నాగచైతన్య సరసన నువ్వు తల్లిగా నటించాలి..అని చెప్పగానే షాక్ అయ్యా. ఆయనకు తల్లిగా నటించడమేంటని, నాగ్‌కి వెంటనే నో చెప్పేశా..” అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. దీంతో బంగార్రాజులో తాత నాగార్జున పాత్రని ఉంచి.. తండ్రి రామ్, తల్లి సీత పాత్రని తీసేసిన విషయం తెలిసిందే. అలా బంగార్రజు సినిమాలో లావణ్య పాత్రని కూడా లేపేశారనమాట.