ఇటీవల ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు బ్రేకప్‌లు కామన్ అయిపోతున్నాయి. ఇక పార్ట్‌నర్స్‌తో విడిపోయిన జంటలు కూడా పీకల్లోతు ప్రేమలో పడుతున్నాయి. కొత్త తోడు వెతుక్కుంటున్నాయి. ఈ జాబితాలోనే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ ప్రేమకథపై ఆసక్తికర వార్త ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే పెళ్లయ్యి పిల్లలు పుట్టి భర్తకు విడాకులు ఇచ్చేసిన ఓ హీరోయిన్… అలాగే ఎప్పుడో పెళ్లయిపోయి ఓ బిడ్డ పుట్టాక భార్యకు విడాకులు ఇచ్చిన మరో హీరో కలిసి ఇప్పుడు సరికొత్త ప్రేమ జర్నీ స్టార్ట్ చేశారట.
బొమ్మరిల్లుతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్.. ఇటీవల కాలంలో సినిమాలతో కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కొందరు హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపిన సిద్ధార్థ్ ఇప్పుడు సరికొత్త తోడు కోసం మరో హీరోయిన్ను పట్టాడని అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు మన హైదారాబాదీ అమ్మాయి అదితి రావ్ హైదరీ.
సిద్ధార్థ్ – అదితి కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఈ సినిమా టైంలోనే ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడడంతో … సినిమా ప్లాప్ అయినా ఇద్దరి మధ్య మంచి అనుబంధం అయితే పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల సిద్ధార్థ్ ముంబైలో అదితి ఇంటికి వెళుతూ కెమేరాలకు దొరికిపోయాడు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా వీరు పలుమార్లు కలిసి కనపడడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న గుసగుసలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవచ్చని అంటున్నారు. ఇక సిద్ధార్థ్‌కు బాయ్స్ సినిమా టైంకే పెళ్లియి ఓ బిడ్డ కూడా పుట్టాడు. నాలుగేళ్లకే భార్యకు విడాకులు ఇచ్చేశాడు.
తర్వాత శృతీహాసన్, సమంతతో కూడా డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్‌తో కూడా డేటింగ్ చేసినా ఆమెతో ప్రేమను కూడా ముగించేశాడు. ఇక హీరోయిన్ అదితి 21 ఏళ్లకే చిన్న వయస్సులోనే సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ నటుడిని పెళ్లాడింది. ఓ బాబు పుట్టాక ఐదేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యింది. మరి ఇప్పుడు సిద్ధార్థ్‌తో కలిసి కొత్త జర్నీ స్టార్ట్ చేస్తోంది. ఈ కొత్త జర్నీలో అయినా ఆమె సక్సెస్ అవుతుందా ? అన్నది చూడాలి.