Moviesసాయి పల్లవిని వాళ్లు చీట్ చేశారా..? ఇంతటి రాంగ్ స్టెప్ ఎలా..?

సాయి పల్లవిని వాళ్లు చీట్ చేశారా..? ఇంతటి రాంగ్ స్టెప్ ఎలా..?

సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి అంటే ఒక్క సపరేటు క్రేజ్ ఉంది. మలర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ… తెలుగులో ఫిదా సినిమాతో హైబ్రీడ్ పిల్ల గా మారిపోయింది. వరుణ్ తేజ్ తో ఆ సినిమాలో అమ్మడు నటించిన తీరు జనాలను బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత కెరీర్ లో చాలా సినిమా లు చేసినా.. పెద్దగా హిట్ కొట్టలేకపోయాయి. కానీ, సినిమా ఫ్లాప్ అయినా ..సాయి పల్లవి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. వామ్మో,,అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే… కళ్లు జిగేల్ అనాల్సిందే.

ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అరుపులు,కేకలు..అబ్బో, మరో లేడీ పవర్ స్టార్ అంటూ ఓ ట్యాగ్ కూడా ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళిన ఆ జనాల అరుపులు చూసి..సాయి పల్లవి సినిమాలు అంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . నిన్న కాక మొన్న వచ్చిన విరాట పర్వం సినిమా టైంలో అమ్మడు వస్తే చేసిన హంగామా మనకు తెలిసిందే. వర్షం పడుతున్నా కానీ, జనాలు కదలకుండా నిల్చుని సాయి పల్లవి కోసం వెయిట్ చేశారు. ఆ అభిమానాని చూసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్నారంతా..కానీ, సీన్ కట్ చేస్తే..సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఇక అదే రేంజ్ లో గార్గి సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో అమ్మడి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఫ్యాన్స్ అరుపులు కేకలు చూసి పొంగిపోయిన సాయి పల్లవి.. తన సినిమాలు ఎలా అయిన హిట్ చేస్తారు అనే భ్రమలో ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు అయితే..సాయి పల్లవి తన అభిమానుల చేతుల్లో మోసపోయింది..అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు ఒక్కే టైప్ ఆఫ్ మూవీ లు చేస్తూ తను రాంగ్ స్టెప్ తీసుకుంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన సాయి పల్లవి గ్రాఫ్ పడిపోయింది అనేది వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news