ReviewsTL రివ్యూ : థ్యాంక్యూ

TL రివ్యూ : థ్యాంక్యూ

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా థ్యాంక్ యు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో వచ్చిన మనం సూపర్ హిట్ అయ్యింది. ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :
ఇండియాలో చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం అమెరికా వెళ్తాడు అభిరాం (నాగ చైతన్య) ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అతనికి ప్రియ (రాశి ఖన్నా) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇక ప్రియ సహాయంతో సొంతంగా మెడికల్ యాప్ రెడీ చేస్తాడు అభి. అది ఇన్వెస్టర్స్ ని ఆకట్టుకోగా అందులో మంచి స్థాయికి చేరుకుంటాడు అభిరాం. తన విజయం తన సొంతం మాత్రమే అని గర్వపడతాడు అభిరాం. కేవలం తన ఒక్కడి వల్లే ఈ స్థాయిలో ఉన్నాడని అనుకుంటాడు. ఈ క్రమంలో తనలో వచ్చిన ఈ మార్పుల వల్ల ప్రియ అతనికి దూరమవుతుంది. అందరు దూరమైన తర్వాత అభి ఏం చేశాడు..? తనలో ఎలాంటి మార్పు వచ్చింది అన్నదే థ్యాంక్ యు కథ.

విశ్లేషణ :
డైరక్టర్, హీరో హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అందులోనూ వరుస హిట్లతో సూప్పర్ ఫాం లో ఉన్న నాగ చైతన్యతో సినిమా అంటే ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే అవేవి థ్యాంక్ యు సినిమాని నిలబెట్టలేకపోయాయని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరైన విక్రం కె కుమార్ ఈమధ్య పెద్దగా ఫాం లో లేకపోయినా మనం కాంబినేషన్ లో సినిమా అనగానే థ్యాంక్ యు మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఈ సినిమా కథ విషయంలోనే డైరక్టర్ విక్రం ఆల్రెడీ ప్రేక్షకులకు తెలిసిన సినిమాల రిఫరెన్స్ వాడినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేమం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ఛాయలు కనిపిస్తాయి. కథ అలా ఉంటే కథనం అయినా హృదయానికి హత్తుకునేలా రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు విక్రం. కథ ఆల్రెడీ చూసిన సినిమాలానే ఉన్నట్టు అనిపించగా స్క్రీన్ ప్లే లో కూడా విక్రం కె కుమార్ మార్క్ మిస్ అయిందని చెప్పొచ్చు.

సినిమాలో కొన్ని చోట్ల ప్రేక్షకులను శాటిస్ఫై చేసిన విక్రం కుమార్ ఫీల్ ని కొనసాగింప చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక సినిమాలో నాగ చైతన్య మహేష్ అభిమానిగా చూపించడం మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని పండుగలా ఉంటుంది. ఆ ఎపిసోడ్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఓ స్థాయికి వెళ్లిన అభి.. అతను ఒంటరిగా అవడానికి కారణాలు అన్వేషించుకుని తన జీవితంలో ఆ స్థాయికి చేరుకోవడానికి ఎవరెవరైతే సహాయపడ్డారో వారందరికి కృతజ్ఞతలు చెప్పడమే ఈ సినిమా కథ.

విక్రం ఇదివరకు సినిమాల కన్నా ఈ సినిమాలో ఫీల్ ని రిప్రెసెంట్ చేయడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్.. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా కొన్ని సీన్లు మాత్ర‌మే న‌చ్చుతాయి. మాస్ మసాలా ఆడియెన్స్ కి మాత్రం ఇది అంత రుచించదు.

నటీనటుల ప్రతిభ :
అభిరాం పాత్రలో నాగ చైతన్య మెప్పించాడు. ఈమధ్య నటనలో పరిణితి తెచ్చుకున్న నాగ చైతన్య సినిమా సినిమాకు ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. థ్యాంక్ యు సినిమాలో అభిరాం పాత్రలో నాగ చైతన్యక్ నూటికి నూరు మార్కులు వేసేయొచ్చు. ఇక హీరోయిన్ రాశి ఖన్నా కూడా అలరించింది. మాళవిక నాయర్ ఉన్నంతవరకు బాగానే చేసింది. అవికా గోర్ కూడా అలరించింది. ప్రకాశ్ రాజ్ ఎప్పటిలానే తన సహజ నటనతో మెప్పించారు. సినిమాలో మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు :
పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. చైతు టీనేజ్ లవ్ స్టోరీలో కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. థమన్ మ్యూజిక్ సాంగ్స్ బాలేదు.. బీజీఎం ప‌ర‌మ రాడ్‌. బివిఎస్ రవి కథ రొటీన్ గానే అనిపించింది. విక్రం కె కుమార్ తన మార్క్ ఈ సినిమాలో చూపించలేకపోయారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దిల్ రాజు ఆ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్ :
– నాగ చైతన్య
– సినిమాటోగ్రఫీ
– కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
– రొటీన్ స్టోరీ
– స్క్రీన్ ప్లే
– మిస్సింగ్ ఎంటర్టైన్ మెంట్

బాటం లైన్: సినిమా త్వర‌గా ముగించి ప్రేక్ష‌కుడిని సేవ్ చేసినందుకు థ్యాంక్యూ

రేటింగ్ : 2.25/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news