MoviesSamantha Koffee With Karan: నెపోటిజంపై స‌మంత బిగ్ బాంబ్‌... నాగ్‌,...

Samantha Koffee With Karan: నెపోటిజంపై స‌మంత బిగ్ బాంబ్‌… నాగ్‌, చైతును టార్గెట్ చేసిందిగా…!

బాలీవుడ్‌ పాపులర్‌ షో కాఫీ విత్‌ కరణ్‌ ప్రస్తుతం ఏడో సీజ‌న్ జ‌రుపుకుంటోంది. ఈ ఎపిసోడ్స్‌లో తాజాగా సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ స‌మంత సంద‌డి చేసింది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్న స‌మంత త‌న విడాకుల‌తో పాటు అక్కినేని ఫ్యామిలీ, చైతును టార్గెట్ చేస్తూ ఎన్నో సంచ‌ల‌న విష‌యాలు చెప్పేసింది. అయితే ఇందులో కొన్ని ప్ర‌త్య‌క్షంగా ఉంటే.. మ‌రి కొన్ని ప‌రోక్షంగా ఉన్నాయి.

త‌న విడాకుల‌తో పాటు టాలీవుడ్ నెపోటిజంపై స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. చాలా మంది హీరోల పిల్ల‌లు, వారి బంధువులు మాత్ర‌మే హీరోలు అవుతారు. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి వాళ్లు స్టార్ హీరోలుగా మార‌డం అరుదు అని చెప్పింది. అనంత‌రం క‌ర‌ణ్ టాలీవుడ్‌ను బిగ్‌బాయ్స్ క్ల‌బ్ అని కామెంట్ రావ‌డం తాను విన్నాన‌ని అంటే స‌మంత రెండు యాపిల్స్ ఒకేలా ఉండ‌వు… నెపో పిల్ల‌లు, నాన్ నెపో పిల్ల‌లు ఎవ‌రైనా… ప్ర‌తిభ క‌లిగి ఉంటారు… వారికి టాలెంట్ ఉంటుంద‌ని చెప్పింది.

ఒక తండ్రి కోచ్‌గా ఉండి.. అత‌డి కొడుకు గేమ్ ఆడుతున్న‌ప్పుడు ప‌క్క‌న నిల‌బ‌డి చూడ‌డం త‌ప్పా… కొడుకును గెలిపించేందుకు తండ్రి ఏం చేయ‌లేడు క‌దా ? అని ఆన్స‌ర్ ఇచ్చింది. స‌మంత ఈ డైలాగ్ ప‌రోక్షంగా నాగ్‌, చైతును ఉద్దేశించి చేసిందా ? అని నెటిజ‌న్ల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక స‌పోర్ట్‌తో ఇండ‌స్ట్రీలోకి రావ‌డంపై ఆమె మాట్లాడుతూ… ఆ ప్ర‌భావం.. మూడు, నాలుగు సినిమాల‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని… ఆ త‌ర్వాత ఉండ‌ద‌ని చెప్పింది.

ఉదాహ‌ర‌ణ‌కు త‌న సినిమాలు ప్లాప్ అయినా.. డిజాస్ట‌ర్ అయినా మా అమ్మ‌, నాన్న‌, మా ఫ్యామిలీకి మాత్ర‌మే తెలుస్తుంద‌ని.. అదే స్టార్ హీరోల పిల్ల‌ల సినిమాలు ఫెయిల్ అయితే దేశం మొత్తం తెలిసిపోతుంద‌ని… వారిని ఎప్పుడూ ట్రోల్ చేస్తూనే ఉంటార‌ని.. వారిని వార‌స‌త్వంతో పోలుస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం కూడా జ‌రుగుతుంద‌ని స‌మంత చెప్పింది.

ఇక సూప‌ర్‌స్టార్లు అంద‌రూ గొప్ప న‌టులు అని.. గొప్ప న‌టులు అంద‌రూ సూప‌ర్ స్టార్స్ అని తాను అనుకోన‌ని సామ్ చెప్పింది. మ‌న స‌క్సెస్‌ను ఎప్పుడూ డిసైడ్ చేసేది ప్రేక్ష‌కులే అని కూడా సామ్ చెప్పింది. ఏదేమైనా స‌మంత నాగ్‌, చైతును ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ త‌న కోపం వ్య‌క్తం చేసిన‌ట్టుగానే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news