దివంగత వర్ధమాన హీరో ఉదయ్ కిరణ్ చాలా తక్కువ టైంలోనే సూపర్ పాపులర్ అయ్యాడు. రెండున్నర దశాబ్దాల క్రితం ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన చిత్రం సినిమాతో హీరో అయిన ఉదయ్ వెంటనే నువ్వు నేను – మనసంతా నువ్వే లాంటి సూపర్ డూపర్ హిట్లతో అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం ముచ్చమటలు పట్టించాడు. అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఉదయ్ కిరణ్ తమ సినిమాల ఫంక్షన్లకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు అంటే అప్పట్లో ఉదయ్ కిరణ్‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
అలాంటి ఉదయ్ కిరణ్ క్రేజ్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి సైతం తన పెద్ద కుమార్తె సుస్మితను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే సుస్మితతో ఉదయ్ కిరణ్ కు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వెంటనే టాలీవుడ్ పెద్ద బ్యానర్ల నుంచి ఉదయ్ కిరణ్ కు ఆఫర్లు వచ్చాయి. తన కుమార్తెతో ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే చిరంజీవి ఉదయ్ కిరణ్ డేట్లు చూసి బాధ్యతను అల్లు అరవింద్ చేతుల్లో పెట్టేశారు. ఆ తర్వాత ఎక్కడో తేడా రావడంతో ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. సుస్మితతో ఉదయ్ కిరణ్ పెళ్లి రద్దు అయ్యింది.
అసలు ఉదయ్‌ను చిరంజీవి తన అల్లుడుగా ఎందుకు చేసుకోవాలనుకున్నారు అంటే ఉదయ్ కిరణ్ కు అప్పట్లో వరుస హిట్లు రావడంతో పాటు యూత్‌లో ఒక్కసారిగా తిరుగులేని ఫాలోయింగ్ వచ్చేసింది. నువ్వు నేను సూపర్ హిట్ అయ్యాక చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి ఉదయ్ కిరణ్ ను అభినందించారు. చిరు ఫోన్ తో ఉక్కిరిబిక్కిరి అయిన ఉదయ్ కిరణ్ వెంటనే చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడట.
అప్పటినుంచి ఉదయ్ కిరణ్ వీలునప్పుడల్లా చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి రావడంతో పాటు… తాను కొత్త కారు కొన్నా కూడా చిరంజీవితోనే ఓపెనింగ్ చేయించాడు. పలు ఫంక్షన్లలో తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం అని… ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని చెబుతూ ఉండేవాడు. ఉదయ్ కిరణ్ చాలా బుద్ధిమంతుడులా ఉన్నాడని.. ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగే లక్షణాలు ఉన్నాయని గ్రహించిన చిరంజీవి వెంటనే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
అలా అనుకున్న వెంటనే తన కుమార్తెతో ఎంగేజ్మెంట్ కూడా జరిపించేశారు. అప్పట్లో టాప్ బ్యానర్లు అయినా గీత ఆర్ట్స్ – శ్రీ సూర్య మూవీస్ – సూపర్ గుడ్ మూవీస్ లాంటి పెద్ద సంస్థల్లో కూడా ఉదయ్ కిరణ్ సినిమాలు చేసేలా చిరంజీవి చక్రం తిప్పారు. ఆ తర్వాత చిరు కుమార్తెతో ఉదయ్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ కు వచ్చిన పెద్ద సినిమాలు అన్ని వెనక్కు వెళ్లిపోయాయి. అలా ఉదయ్ కిరణ్ డౌన్ పాల్ ప్రారంభమయింది.