Moviesఅఖిల్ కొత్త సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్ పెట్టేశారే...!

అఖిల్ కొత్త సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్ పెట్టేశారే…!

అక్కినేని హీరో అఖిల్ ఎట్ట‌కేల‌కు మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో అఖిల్ భారీ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర నిర్మిస్తోన్న ఏజెంట్ సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సురేంద‌ర్‌రెడ్డి సైరా సినిమా త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమా త‌ర్వాత అఖిల్ కొత్త సినిమా గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ వినిపిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌తో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలోనే అఖిల్ నెక్ట్స్ సినిమా ఉండ‌బోతోంద‌ట‌. ఈ సినిమా దిల్ రాజు బ్యాన‌ర్లోనే ఉండ‌బోతోందంటున్నారు. దిల్ రాజు అఖిల్‌తో ఎప్ప‌టి నుంచో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు త‌మ్ముడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. త‌మ్ముడు అన‌గానే మ‌న‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన త‌మ్ముడు సినిమా గుర్తుకు వ‌స్తుంది. ప‌వ‌న్ హీరోగా పీఏ ఆరుణ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మ్ముడు సినిమా వ‌చ్చింది. ప్రీతి జింగానియా, ఆదిథి హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. అప్ప‌ట్లో ఇదో ట్రెండ్ సెట్ట‌ర్‌.

మ‌ళ్లీ ఈ సినిమా వ‌చ్చిన రెండు ద‌శాబ్దాల త‌ర్వాత యంగ్ హీరో అఖిల్ అదే టైటిల్‌తో సినిమా తీయ‌డం విశేషం. అఖిల్ క‌నుక ప‌వ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ టైటిల్ త‌మ్ముడునే పెట్టుకుని ఇప్పుడు సినిమా తీస్తే సినిమాపై ముందే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వ‌డం ఖాయం. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ న‌డుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news