Moviesలైగర్ న్యూడ్ పోస్టర్ కు విజయ్ అందుకే ఒప్పుకున్నాడా..ఇంత కధ ఉందా..?

లైగర్ న్యూడ్ పోస్టర్ కు విజయ్ అందుకే ఒప్పుకున్నాడా..ఇంత కధ ఉందా..?

గత కొన్ని గంటల నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పేరు విజయ్ దేవరకొండ. పెళ్ళి చూపులు సినిమాతో ఫాంలోకి వచ్చిన ఈ హీరో..అర్జున్ రెడ్డి సినిమాతో తన తల రాతను మార్చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. విజయ్ కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.

ఆ తరువాత చాలా సినిమాలు వచ్చినా అర్జున్ రెడ్డి సినిమా స్దాయిలో అభిమానులను మెప్పించలేకపోయాయి. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ రేంజ్ సినిమా అంటూ ఆయన లైగర్ మూవీ కోసం ఐఇగర్ వెయిట్ చేస్తున్నారు అభిమానులు. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లైగర్ టీం విజయ్ న్యూడ్ పోస్టర్ ను షేర్ చేసారు. రిలీజ్ అయిన 24 గంటల్లు కాకముందే.. ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా 1.3 మిలియన్ లైక్స్‌ వచ్చాయి. ఈ ఘనత సాధించిన తొలి పోస్టర్ ఇదే కావడం మరింత విశేషం. అయితే, ఇంత పెద్ద స్టార్ హీరో ఇలా న్యూడ్ పోస్టర్ కి ఫోజులివ్వడాని తప్పుబడుతున్నారు జనాలు.

కాగా, ఇలాంటి న్యూడ్ ఫోటోకి విజయ్ ఎందుకు ఒప్పుకున్నాడా అని బుర్ర బద్ధలుకొట్టుకుంటున్న టైంలో..ఓ న్యూస్ వైరల్ గా మారింది.కొన్ని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్‌లలో పాల్గొనబోయే ఫైటర్‌ల బరువును కొలవడానికి వారు న్యూడ్‌గా నిలుచుంటారట. వారి బరువును గ్రామ్‌లలో కొలవడానికి అస్సలు ఒంటిమీద చిన్న నూలుపోగు కూడా ఉంచుకోరట. ఇలాంటి విషయాలు ఈ లీగ్స్‌ను ఫాలో అయ్యేవారికి బాగా తెలుస్తుంది. సో, బాక్సింగ్ నేపధ్యంలో వచ్చే సినిమా కాబట్టి సింబాలిక్‌గా ఈ పోస్టర్‌ను అలా విడుదల చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news