Moviesఎన్టీఆర్ రమ్యకృష్ణను నలిపేశాడ‌న్నారు.. అస‌లు జ‌రిగింది ఇదే...!

ఎన్టీఆర్ రమ్యకృష్ణను నలిపేశాడ‌న్నారు.. అస‌లు జ‌రిగింది ఇదే…!

నందమూరి ఫ్యామిలీ హీరోలకు ఆడవారంటే ఎంత గౌరవమో వారికి దగ్గరగా ఉన్నవారికి దగ్గరగా చూసిన వారికీ బాగా తెలుస్తుంది. అది ఆ ఎన్.టీఅర్ నుంచి ఈ ఎన్.టి.ఆర్ వరకు హరికృష్ణ, బాలకృష్ణ ..కళ్యాణ్ రామ్ ఇలా నందమూరి నటులెవరైనా ఎప్పుడూ హీరోయిన్స్ గురించి తక్కువ చేసి మాట్లాడింది లేదు. చులకనగా చూసిందీ లేదు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సింహాద్రి. ఈ సినిమాను విఎంసి ప్రొడక్షన్స్ పతాకంపై అగ్ర నిర్మాత వి దొరస్వామిరాజు సమర్పణలో ఆయన వారసుడు విజయ్ కుమార్ వర్మ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

అప్పటికే తారక్ ఫ్లాప్ సినిమా చూసి ఉండటంతో మళ్ళీ భారీ హిట్ కొట్టాలనే కసితో అగ్ర రచయితల వద్ద కథలు వింటున్నారు. కానీ, ఏవీ తారక్‌కు నచ్చడం లేదు. ఫైనల్‌గా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బాలకృష్ణ కోసం అనుకున్న సింహాద్రి కథను తారక్ కి చెప్పారు. జస్ట్ 12 నిమిషాలే కథ చెప్పారు. 13వ నిమిషంలో తారక్ లేచి రాజమౌళిని గట్టిగా కౌగిలించుకొని ఇలాంటి కథ కదా మనకు కావాల్సింది..అని ఒకే చెప్పాడు. తారక్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే చక చకా ప్రొడక్షన్స్ వర్క్ మొదలైపోయింది. హీరోయిన్స్.. భూమిక, అంకిత ఫిక్స్ చేశారు.

ముఖేష్ రుషి, కోట శ్రీనివాస రావు, చలపతి రావు, బ్రహ్మానందం, నాజర్, భానుచందర్ లాంటి ప్రముఖ నటి నటులను ఫైనల్ చేశారు. సంగీత దర్శకుడిగా ఎం ఎం కీరవాణి..ఇతర టెక్నీషియన్స్ అందరూ ఫైనల్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఉన్న చిన్నదమ్మే చీకులు కావాలా సాంగ్ కోసం అప్పటికే మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్స్‌ను తీసుకోవాలనుకున్నారు. దీనిపై చర్చలు కూడా బాగానే జరిగాయి. కానీ, ఎందుకో రమ్యకృష్ణతో ఈ సాంగ్ చేయిస్తే బావుంటుందని రాజమౌళి బృందం భావించారు. అయితే, అంత సీనియర్ హీరోయిన్‌ను ఐటెం సాంగ్ కోసం అడిగితే ఎలా..? అని సందేహం.

అంతేకాదు, రమ్యకృష్ణ పక్కన తారక్‌ను ఐటెం సాంగ్ చేయమంటే ఇబ్బంది పడతాడేమో అని ఇంకో సందేహం. ఇదే విషయాన్ని తారక్ వద్ద ప్రస్తావిస్తే ముందు కాస్త ఆలోచించినా ఈ సినిమాకు ఆ సాంగ్, అందులో రమ్యకృష్ణ గారు ప్లస్ అవుతారనుకుంటే చేసేద్దాం..మరి ఆవిడ ఒప్పుకుంటారా..? అని తనవైపు నుంచి ఒకే చెప్పారు. ఇక రాజమౌళి టీమ్ ఒప్పించాల్సింది రమ్యకృష్ణనే. మొత్తానికి ఆమెని ఒప్పించారు. తారక్ అనగానే చాలా ఎగ్జైటింగ్‌గా ఎస్ అన్నారు. ఈ సాంగ్‌లో కొన్ని స్టెప్స్ చూస్తే ఎవరికైనా మీటర్లు పగిలిపోవాల్సిందే.

లిరిక్స్ తగ్గట్టుగా మాస్ స్టెప్స్ కంపోజ్ చేయడం బాగా కుదురింది. అందుకే, ఈ సాంగ్ చూశాకా..అబ్బా..రమ్యకృష్ణను ఏం నలిపేశాడు తారక్ అని మాట్లాడుకున్నారు. కానీ, ఈ సాంగ్ చేసినప్పుడు రమ్యకృష్ణ కంటే ఎక్కువగా ఇబ్బంది పడింది తారక్. సాధ్యమైనంతర వరకూ రమ్యకృష్ణను టచ్ చేయకుండానే డాన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఫైనల్‌గా సాంగ్ షూట్ అయ్యాక..రమ్యకృష్ణ దగ్గరికి వెళ్ళి ..ఇబ్బంది కలిగి ఉంటే సారీ అండీ అని తారక్ వినయంగా చెప్పాడట. దానికి ఆమె..అసలు నీ స్టెప్పులు చూస్తే నాకు ఇంకేదీ గుర్తు రాలేదు. ఇంక ఇబ్బంది గురించి ఎక్కడ పట్టించుకుంటాను అని…పొగడ్తలతో ముంచేశారట. అదీ తారక్ అన్నా..నందమూరి హీరోలైనా..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news