సీనియర్ నటుడు వీకే నరేష్… సీనియర్ నటి పవిత్ర లోకేష్ వ్యవహారం ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కన్నడ సినిమా పరిశ్రమలోనూ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే వీరిద్దరు తమ భార్య, భర్తలకు విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకుంటున్నారంటూ వస్తోన్న వార్తలు బాగా వైరల్‌గా మరాయి. వీరిద్దరి పెళ్లి వార్తలతో ఇటు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, అటు పవిత్రా లోకేష్ రెండో భర్త అయిన కన్నడ సీరియల్ నటుడు సుచేంద్ర ప్రసాద్ కూడా బయటకు వచ్చారు.
ఇటు తన భర్త నరేష్‌పై రమ్య తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పాటు పవిత్ర తమ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యాకే తమ జీవితం విడాకుల వరకు దారితీసిందని ఆరోపిస్తోంది. ఇటు సుచేంద్ర కూడా తన భార్య పవిత్రపై ఘాటైన కౌంటర్లు ఇస్తున్నాడు. చివరకు తమపై ఆరోపణలు రావడంతో నరేష్, సుచిత్ర కూడా స్పందించక తప్పడం లేదు. నరేష్ అయితే ఏకంగా తన భార్య రమ్యకు డ్రైవర్‌తో కూడా ఎఫైర్ ఉందని బ్లాస్టింగ్ ఆరోపణలు చేశారు.
ఇటు పవిత్ర కూడా రమ్య బెంగళూరు వెళ్లి మరీ అక్కడ తనను బద్నాం చేస్తోందని.. ఆమెకు నరేష్ గారితో ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడ హైదరాబాద్‌లో సెటిల్ చేసుకోవాలే కాని.. బెంగళూరులో ఆమెకు ఏం పని అని.. కేవలం తనను బద్నాం చేసేందుకే ఆమె అక్కడకు వెళ్లి ఆరోపణలు చేస్తోందని ఓ వీడియోలో కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ ఇష్యూలో పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్ కామెంట్లు బయటకు రాలేదు.
రమ్య కర్నాకటలో దిగి పవిత్రపై ఆరోపణలు చేసిన వెంటనే పవిత్ర భర్త సుచేంద్ర కూడా లైన్లోకి వచ్చేశాడు. సీరియల్స్‌లో నటిస్తోన్న టైంలో పవిత్ర, సుచేంద్ర మధ్య పరిచయం స్నేహంగా మారి పెళ్లి వరకు వచ్చింది. వీరిద్దరికీ ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఇక సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పవిత్ర పెళ్లియన కొత్తలో బాగానే ఉందని.. కానీ పిల్లలు పుట్టిన తర్వాత తనను వదిలేసి వెళ్లిపోయిందని ఆరోపించాడు.
పవిత్రది కాపురాలు కూల్చే బుద్ధి అని.. ఒక నటిగా ఆమెకు అలాంటి మనస్తత్వం మంచిది కాదని కూడా సుచేంద్ర ఫైర్ అయ్యాడు. తాను చాలాసార్లు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదని.. ఆమె తనకు దూరమైనప్పటి నుంచే ఒంటరిగా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు. పవిత్రది దోచుకునే మనస్తత్వం అని.. ఆమెకు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడమే ఇష్టం అని.. తనను డబ్బులు లేని కారణంగానే విడిచి పెట్టిందని సుచేంద్ర ఆరోపించాడు.
పైగా తాను ఆమెను కొట్టానని.. తిట్టానని ఆరోపణలు చేస్తోందని.. అలా అయితే నరేష్ దగ్గరకు వెళ్లడం కరక్టా ? అని ప్రశ్నించాడు. పవిత్ర మనస్తత్వం తనకు బాగా తెలుసు అని.. ఆమెకు డబ్బులు చేతికి వచ్చిన వెంటనే ఆరు నెలల్లోనే నరేష్‌ను కూడా వదిలేస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి రమ్య ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన పవిత్ర ఇప్పుడు తన భర్త సుచేంద్ర విమర్శలపై ఏమని స్పందిస్తుందో ? చూడాలి.