Movies' ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. గోపీచంద్ కెరీర్...

‘ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. గోపీచంద్ కెరీర్ రికార్డ్‌..!

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్. ఈ శుక్ర‌వారం పాజిటివ్ వైబ్స్ మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే లాజిక్‌లు ప‌ట్టించుకోకుండా మారుతి మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్ష‌న్ ఇష్ట‌ప‌డే వారికి న‌చ్చుతుంద‌నే అంద‌రూ చెపుతున్నారు. స‌రే టాక్‌తో సంబంధం లేకుండా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫ‌స్ట్ డే అదిరిపోయే వ‌సూళ్లు సొంతం చేసుకుంది.

గోపీచంద్ కెరీర్‌లోనే ఏ హిట్ సినిమాకు రాని విధంగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌కు డే 1 రు 6.3 కోట్ల గ్రాస్ వ‌సూల్లు వ‌చ్చాయి. ఇప్పుడు పోటీ సినిమాలు ఏవీ థియేట‌ర్ల‌లో లేక‌పోవ‌డంతో పాటు గ‌త శుక్ర‌వారం వ‌చ్చిన ఆరేడు సినిమాలు అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌కు వారం రోజుల పాటు తిరుగులేని వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. ఈ సినిమాకు ఓవ‌రాల్‌గా రు. 15 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకే రు. 12 – 15 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. ఓవ‌రాల్‌గా మారుతి చూపించిన సీరియ‌స్ అంశం కూడా మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగానే క‌నెక్ట్ అయ్యేలా ఉంది. ఇక సాంగ్స్‌తో పాటు రాశీఖ‌న్నా కామెడీ, అందాలు ఇవ‌న్నీ యూత్‌ను మెప్పిస్తున్నాయి. చాలా రోజులుగా త‌న స్థాయికి త‌గిన హిట్ లేని గోపీచంద్‌కు ప‌క్కా క‌మర్షియ‌ల్‌తో మారుతి క‌మర్షియ‌ల్‌గా మంచి సినిమాయే ఇచ్చాడు.

అయితే ఫ‌స్ట్ వీకెండ్ వ‌సూళ్లు చూశాక‌.. సోమ‌వారం నుంచి సినిమా ఎంత స్టడీగా ఉంటుంద‌నే దానిపై ఈ సినిమా రేంజ్ ఏంట‌నేది క్లారిటీ రానుంది. మారుతి క‌రోనాకు ముందు ప్రతి రోజు పండగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ కూడా సేఫ్ అయ్యే ఛాన్సులే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news