ఓ స్టార్ హీరోయిన్ నటించిన సినిమాలో మరో యావరేజ్ హీరోయిన్ గనక నటిస్తే దాదాపు ఆమెకు పెద్దగా ప్రాధాన్యం దక్కనట్టే అని భావించాలి. ఎందుకంటే సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్స్ ఎప్పుడూ సక్సెస్ సాధించలేరు. దీనికి ఉదాహరణ గురూజీ త్రివిక్రమ్మ్ సినిమాలే. ఆయన సినిమాలో మెయిన్ హీరోయిన్‌కి మంచి పాపులారిటీ వచ్చేస్తుంది. కానీ, సెకండ్ లీడ్ చేసిన హీరోయిన్ మాత్రం అట్టడుగుకి చేరుతుంది. ఎంతోమంది టాలెంట్ ఉన్న హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసి సడెన్‌గా కనుమరుగు అయిపోయారు.
ప్రణీత, అనుపమ పరమేశ్వరన్, ఆదాశర్మ ఇలా ఎంతోమంది త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసి అడ్రస్ లేకుండా పోయారు. అందుకే ఇటీవల కాలంలో గురూజీ సెకండ్ లీడ్ ఆఫర్ ఇచ్చినా చాలామంది నో అని రిజెక్ట్ చేయడానికి ఇదే పెద్ద కారణం. ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంది మజిలీ భామ దివ్యాన్ష కౌశిక్. శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య – సమంత – దివ్యాన్ష కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మజిలీ.
ఈ సినిమాతోనే దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయింది. మొదటి భాగం మొత్తం ఆమె కనిపిస్తుంది. నాగ చైతన్యతో లవ్ ట్రాక్..సాంగ్..మంచి మసాలా సీన్స్..ఇలా స్క్రీన్ మీద చాలాసేపే కనిపించింది. అయితే, ఫస్టాఫ్ అయే ముందు సమంత ఎంట్రీతో అంతసేపూ ఉన్న దివ్యాన్ష కౌశిక్ ఒక్కసారిగా జనాల మైండ్‌లో నుంచి వెళ్ళిపోయింది. సమంత వర్షంలో ఆటోలో దిగి గొడుగులో పోలీస్ స్టేషన్లోకి ఎంట్రీ ఇచే సీన్ హైలెట్‌గా నిలిచింది. ఈ సీన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా పస్ అయింది.
అక్కడనుంచి మజిలీ మూవీ సెకండ్ హాఫ్ మొత్తం సమంతనే ఆక్యూపై చేసేసింది. దాంతో దివ్యాన్ష కౌశిక్ కి మజిలీ సినిమా ఎంత మాత్రం కలిసి రాలేదు. ఈ సినిమావచ్చి చాలా ఏళ్ళు గడిచిన మళ్ళీ హీరోయిన్గా అవకాశం రానేలేదు. దీనికి సమంతనే ఓ కారణం అని గట్టిగా చెప్పాలి. తనకున్న క్రేజ్ వల్లే దివ్యాన్ష కౌశిక్ తేలిపోయింది. ఎట్టకేలకి ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ సరసన రామారావు ఆన్‌డ్యూటీ సినిమాలో నటిస్తోంది. చూడాలి మరి ఇది ఆమెకి ఎంతవరకు కలిసి వస్తుందో.