నరేష్ – పవిత్రా లోకేష్ – రమ్య రఘుపతి మధ్య నడుస్తోన్న ట్రైయాంగిల్ డ్రామాకు ఇప్పట్లో తెరపడేలా లేదు. నిన్న బెంగళూరులో నరేష్ – పవిత్రా లోకేష్ ఓ హోటల్లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న రమ్య అక్కడకు వెళ్లి పవిత్రాపై చెప్పుతో దాడి చేసేందుకు విఫలయత్నం చేసింది. అయితే ఈ విషయంలో రమ్య రఘుపతి ఎంతకైనా తెగించినట్టే కనిపిస్తోంది. తనను పెళ్లి చేసుకున్న విడాకులు ఇవ్వకుండా మరో మహిళను ఎలా పెళ్లి చేసుకుంటాడని.. ఈ విషయంలో తాను ఎక్కడికి అయినా వెళతానని అంటోంది.
నరేష్ – పవిత్రా లోకేష్ ఎలా కలిసుంటారో ? కూడా తాను చూస్తానని మరీ సవాల్ చేస్తోంది. అటు నరేష్ పవిత్రా లోకేష్‌ను పెళ్లి చేసుకుంటారా ? అని ప్రశ్నిస్తే ప్రస్తుతం తాను నడిసంద్రంలో ఉన్నానని.. పవిత్రను పెళ్లి చేసుకునేది లేనిది తాను ఇప్పుడే చెప్పలేనని.. అయితే అలాంటిది ఉంటే తాను ప్రెస్‌మీట్ పెట్టి చెపుతానని అన్నారు.
ఇక ప్రస్తుతం తాళి అనేది ఒక లైసెన్స్ మాత్రమే అని.. ప్రతి 10 జంటల్లో 8-9 జంటలు విడిపోతున్నారని.. అందువల్ల వివాహం అనేది తప్పనిసరి కాదని.. మనం విశ్వసించే వ్యక్తులతో కలిసి పనిచేయడమే అని చెప్పారు. నరేష్ చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఆయన పవిత్రా లోకేష్‌తో పెళ్లి అనే బంధంలోకి అడుగు పెట్టేందుకే ఆసక్తి చూపుతున్నట్టు అర్థమవుతోంది.
ఇక తనపై రమ్య చేసిన ఆరోపణల నేపథ్యంలో అటు నరేష్ కూడా స్పందించారు. రమ్య ఎప్పుడూ తన ఫ్యామిలీకి దూరంగా ఉండాలని కోరుకుందని.. ఎప్పుడూ తనకు భార్యగా ప్రవర్తించలేదని.. ఆమెకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. రమ్యకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువుగా ఉందని.. ఆమె డబ్బుల కోసం తనను ఎన్నోసార్లు బ్లాక్‌మెయిల్ కూడా చేసిందని ఆరోపించారు.
ఆమె డబ్బుల కోసం ఏకంగా కృష్ణ గారి దగ్గరకే వెళితే తానే రు. 10 లక్షలు ఇచ్చానని.. అంతేకాకుండా ఆమె హైదరాబాద్‌లో చేసిన అప్పులు అన్నీ కూడా తానే కట్టానని నరేష్ చెప్పారు. రమ్యకు మానసిక స్థితి సరిగా లేదని.. ఆమెకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక అని.. అందుకోసం డబ్బు కావాలని.. ఆ డబ్బుకోసమే ఆమె ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తోందని నరేష్ ఆరోపించారు. ఇక రమ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహానీ ఉందని.. అందుకే ఆమెకు లీగల్ నోటీసులు పంపానని చెప్పారు. ఏదేమైనా ఈ ట్రయాంగిల్ డ్రామాకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ? చూడాలి.