రాజమౌళిని సినిమా సినిమాకు ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు వెళ్లిపోతున్నాడు. బాహుబలి సీరిస్ సినిమాలతోనే మన తెలుగు సినిమా ఖ్యాతిని మాత్రమే కాదు.. భారతీయ సినిమా ఖ్యాతిని కూడా ఆయన ఎల్లలు దాటించేశాడు. అంతెందుకు తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు ఏకంగా రాజ్యసభ రావడంలోనూ రాజమౌళి టాలెంటే ఎక్కువ ఉందని కూడా అందరూ పొగుడుతన్నారు. ఇక ఈ యేడాది త్రిబుల్ ఆర్ లాంటి మరో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్‌తో రాజమౌళి తన స్తాయి ఏంటో ఫ్రూవ్ చేసుకున్నాడు.
ఇక రాజమౌళి నెక్ట్స్ సినిమా మహేష్‌బాబుతోనే ఉంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్. నారాయణ రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పేశారు. ఇక ఇప్పుడు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లు కూడా రాజమౌళితో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళికి ఏకంగా రు. 100 కోట్ల కళ్లుచెదిరే డీల్ వచ్చింది.
త్రిబుల్ ఆర్ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్‌గా బాగా ట్రెండ్ అవుతోంది. ప్రపంచంలోని పలుదేశాల్లో త్రిబుల్ ఆర్ సినిమాను నెట్‌ఫ్లెక్స్ సంస్థే స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా ఆదరణ వస్తోన్న నేపథ్యంలో రాజమౌళితో కలిసి వర్క్ చేయాలన్న నిర్ణయానికి వచ్చిందట. రాజమౌళితో ఒరిజినల్ కంటెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు నెట్ ఫ్లిక్స్ రెడీ అవుతోందట.
ఇందుకోసం రాజమౌళికి మాత్రమే రెమ్యునరేషన్‌గా ఏకంగా రు. 100 కోట్లు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజమౌళి ఎలాంటి స్క్రిఫ్ట్, ఎలాంటి నేపథ్యం ఉన్న లైన్ తీసుకున్నా అతడి ఇష్టం. అయితే తమ కోసం మాత్రం అదిరిపోయే కంటెంట్‌తో వెబ్‌సీరిస్ ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాజమౌళి మహేష్‌బాబు సినిమా మీదే ప్రధానంగా కాన్‌సంట్రేషన్ చేశాడు.
ఈ సినిమా ఫినిష్ అయ్యేందుకే ఏలా లేదన్నా మరో రెండేళ్లకు పైగానే పడుతుంది. ఆ తర్వాతే రాజమౌళి నెట్‌ఫ్లిక్స్ డీల్ గురించి ఆలోచన చేయవచ్చు. రాజమౌళి నిజంగానే ఓటీటీ కంటెంట్ తీస్తే అది కూడా మరెన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయితే పక్కా..!