మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్. రెండున్నర దశాబ్దాల క్రిందట ఐశ్వర్యారాయ్ అందాన్ని చూసేందుకు భారతీయ యువత పిచ్చెక్కిపోయేది. అప్పట్లో ఐశ్వర్యారాయ్ ముందుగా బాలీవుడ్ కంటే సౌత్ సినిమాల్లోనే ఎక్కువుగా నటించేది. మణిరత్నం సినిమాలతో పాటు శంకర్ జీన్స్ సినిమాలో కూడా నటించింది. నాగార్జున రావోయి చందమామ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.
ఐశ్వర్య ఓ సినిమాలో ఉంటే ఆమెను చూసేందుకే యువత థియేటర్లకు వచ్చేవారు. ఆ తర్వాత సల్మాన్‌ఖాన్‌తో ప్రేమాయణం తర్వాత ఐశ్వర్య మరింత వార్తల్లోకి ఎక్కింది. ఐశ్వర్యరాయ్‌తో ఒక్క సినిమాలో అయినా చేయాలని తాపత్రయ పడిన హీరోలు ఎంతోమంది ఉన్నారు. కొందరు కుర్ర హీరోలు కూడా పట్టుబట్టి మరీ ఆమెనే హీరోయిన్‌గా పెట్టాలని దర్శకులను వేడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప అందం ఐశ్వర్యది.
ఐశ్వర్యారాయ్‌తో నటించాలని హీరోలకు ఎలా ఉంటుందో దర్శకులకు కూడా ఆమె తమ సినిమాల్లో ఉండాలని కోరిక ఉంటుంది. స్టార్ డైరెక్టర్లు సైతం ఐశ్వర్యను పట్టుబట్టి మరీ తమ సినిమాల్లో తీసుకునేవారు. మణిరత్నం అయితే ఐశ్వర్య కాల్షీట్ల కోసం ఎన్ని రోజులు అయినా వెయిట్ చేసేవారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణకు కూడా ఐశ్వర్యారాయ్‌తో ఒక్క సినిమా అయినా తీయాలన్న కోరిక ఉండేదట.
దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడు అయిన కోడి రామకృష్ణ తన గురువు బాటలోనే శతాధిక చిత్రాల దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేశారు. కోడి రామకృష్ణ మరణాంతరం ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన కుమార్తె దివ్య సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దివ్య నిర్మాతగా మారి సినిమా తీస్తోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నేను మీకు బాగా కావాల్సినవాడ్ని అనే సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో తన తండ్రి తీరని కోరికను దివ్య బయట పెట్టింది ఇన్నాళ్లకు.
చాలా స్పీడ్‌గా సినిమాలు పూర్తి చేయడం తన తండ్రి స్పెషాలిటీ అని.. ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా.. ఎన్ని గ్రాఫిక్స్ ఉన్నా కూడా అనుకున్న టైంకే సినిమా ఫినిష్ చేస్తారని.. అదే స్పీడ్‌తో ఐశ్వర్యారాయ్‌తో కూడా ఓ సినిమా చేయాలని నాన్న చివరి కోరికగా ఉండేది.. ఐశ్వర్యతో మంచి ఫీమేల్ సబ్జెక్ట్‌తో సినిమా చేయాలని నాన్న ఎన్నోసార్లు మాతో చెప్పారు. అయితే ఆ కోరిక తీరకుండానే నాన్న కన్నుమూశారని దివ్య చెప్పింది.