Moviesనాగార్జున సంతోషం హీరోయిన్ గ్రేసీసింగ్‌కు టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ బాధ‌లు త‌ప్ప‌లేదా...!

నాగార్జున సంతోషం హీరోయిన్ గ్రేసీసింగ్‌కు టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ బాధ‌లు త‌ప్ప‌లేదా…!

కొంతమంది హీరోయిన్స్ చాలా టాలెంటెడ్ అయినా కూడా వాళ్ల పరిధి దాటి ఉండలేక.. కొనసాగలేక అర్ధాంతరంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతారు. కొందరు మాత్రం అన్నీ భరిస్తూ అందులోనే ఆనందం, క్రేజ్ సంపాదించుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంటున్నారు. కానీ, కొంతమంది మాత్రం స్టార్ హీరోలు దర్శక నిర్మాతలు పెట్టే టార్చర్ భరించలేక ఇండస్ట్రీ వదిలి పారిపోతున్నారు. కారణం ఏదైనా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న గ్రేసీ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. హిందీలో ఆమిర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాతో హిందీ సీమకు పరిచయమైంది.

ఈ సినిమా హిందీలో అవార్డులు, రివార్డులు అందుకుంది. ముఖ్యంగా గ్రేసీ సింగ్ నేచురల్ పర్ఫార్మెన్స్ బాలీవుడ్ సినీ ప్రముఖులనే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే, లగాన్ సినిమా చూసిన కింగ్ నాగార్జున ఆయన హీరోగా దరశథ్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన సంతోషం సినిమాలో ఛాన్స్ ఇవ్వ‌డంతో గ్రేసీ టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమాలో గ్రేసీ సింగ్ పర్ఫార్మెన్స్ చూసిన అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు. అంతేకాదు టాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పుకున్నారు. దీనికి కారణం సంతోషం సినిమా చేస్తున్నప్పుడే మంచు మోహన్ బాబు, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తప్పుచేసి పప్పుకూడు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అయితే, ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తప్పు చేసి పప్పుకూడు డిజాస్టర్ అయినా సంతోషం సినిమానే గ్రేసీ సింగ్‌కి ఇంకా అవకాశాలు తెచ్చిపెట్టింది.

కానీ, రెండు సినిమాల తర్వాత మళ్ళీ గ్రేసీ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి రావడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం తెలుగులో తను నటించిన ఈ రెండు సినిమాలలో ఒక సినిమా వల్ల… ఆ సినిమా యూనిట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. సాధారణంగా హీరోయిన్స్ కొందరు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెబుతుంటారు. మరి గ్రేసీ సింగ్ ఎదుర్కొన్నది ఆ సమస్యలేనా ..? అంటే అప్పట్లో ఇదే మాట గట్టిగానే వినిపించింది.

ఏదేమైనా గ్రేసీ సింగ్ టాలీవుడ్‌కి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవం అని కొన్ని మీడియా కథనాలలో ప్రచారం జరిగింది. దీనివల్లే ఆమె ఇక్కడ సినిమాలు వదులుకుందని..చెప్పుకున్నారు. అయితే, గ్రేసీసింగ్ హిందీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువకాలం కొనసాగలేదు. అక్కడ కూడా ఇదే కారణమా ..? అనేది తెలియదు గానీ, తనకంటే ముందు వచ్చిన వారూ ఇంకా కొనసాగుతున్నారు. తన తర్వాత వచ్చినవారూ ఉన్నారు. కానీ గ్రేసీ మాత్రం అడ్రస్ లేకుండా పోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news