జేడీ చక్రవర్తి అలియాస్ గడ్డం చక్రవర్తి… దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డైరెక్టర్‌గా తన జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడిగా సినిమాల్లోకి వచ్చిన వర్మ తన గురువు స్టైల్లోనే విలక్షణతతో ఉంటాడు. వర్మ శిష్యుడు అయిన కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన గులాబీ సినిమాలో జేడీ చక్రవర్తి – మహేశ్వరి కలిసి జంటగా నటించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సురేష్ వర్మ రుద్రరాజు దర్శకత్వంలో మృగం సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలోనే దెయ్యం సినిమా వచ్చింది. ఈ సినిమాకు రాంగోపాల్ వర్మ దర్శకుడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
అప్పట్లో జేడీ చక్రవర్తి – మహేశ్వరి కాంబినేషన్లో చాలా తక్కువ టైంలో వరుస సినిమాలు రావడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం పీక్స్ స్టేజ్‌లో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించేవి. ఇంతకు మహేశ్వరి ఎవరో కాదు అతిలోక అందాల సుందరి శ్రీదేవికి కజిన్. ఇక కెరీర్ స్టార్టింగ్‌లో జేడీ చక్రవర్తి వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. కృష్ణవంశీ, రవితేజ, జేడీ, తేజ వీళ్లంతా వర్మ శిష్యులే.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో తర్వాత వర్మ సూచన మేరకు జేడీ నటుడు అయ్యాడు. గులాబీ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఓ రోజు మహేశ్వరి, వాళ్ల మదర్ జేడీని వాళ్ల ఇంటికి లంచ్‌కు పిలిచారు అట. అయితే వాళ్లు లంచ్‌కు పిలిచిన ఇళ్లు చెన్నైలో శ్రీదేవి ఇళ్లు. శ్రీదేవి ఆ రోజు షూటింగ్లో నార్త్‌లో ఉన్నారట. అప్పటకీ శ్రీదేవికి పెళ్లి కాలేదు.
జేడీ మహేశ్వరి చెప్పిన అడ్రస్ ప్రకారం శ్రీదేవి ఇంటికి వెళ్లి తలుపు తీసిన వెంటనే ఓ మహిళ వచ్చి జేడీని గట్టిగా పట్టుకుని మా అమ్మాయి శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారట. ఆ మహిళ ఎవరో కాదు శ్రీదేవికి స్వయానా తల్లి. అయితే ఆమెకు తలలో ఎడమవైపు చేయాల్సిన ఆపరేషన్.. కుడి వైపు చేయడంతో మానసిక స్థితి సరిగా లేదట. ఆ కండీషన్లో ఉన్న ఆమె జేడీని చూసిన వెంటనే.. గట్టిగా పట్టుకుని మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడగడంతో జేడీ షాక్ అయిపోయారట.
తర్వాత జేడీ అసలు విషయం తెలుసుకున్నారట. గులాబీ తర్వాత మహేశ్వరితో వరుసగా సినిమాలు చేసిన జేడీ తర్వాత ఆమెకు దూరమయ్యాడు. మహేశ్వరి సినిమాలకు దూరమయ్యాక పెళ్లి చేసుకున సెటిల్ అయ్యింది. అయితే జేడీ మాత్రం నాలుగున్నర దశాబ్దాల వరకు బ్యాచిలర్‌గానే ఉంటూ 2016లో అనుకృతి శర్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె వర్మ దర్శకత్వంలో వచ్చిన శ్రీదేవి సినిమాలో హీరోయిన్గా నటించింది. అయితే ఇటీవల ఈ దంపతుల మధ్య స్పర్థలతో వేర్వేరుగా ఉంటున్నారన్న వార్తలు అయితే బయటకు వచ్చాయి.