దివంగత టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్‌కిరణ్ కెరీర్ తారాజువ్వలా ఎగసిపడి ఒక్కసారిగా ఆరిపోయింది. చాలా తక్కువ టైంలో టాలీవుడ్ స్టార్లకే చెమటలు పట్టించిన ఉదయ్‌కిరణ్ అంతే త్వరగా తెరమరుగు అయిపోయాడు. ఉదయ్ కిరణ్ కెరీర్ ఫస్ట్ మూడు సినిమాల రేంజ్లో కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పుడు ఎక్కడో ఉండేవాడు. ఉదయ్‌కిరణ్ కెరీర్ స్టార్టింగ్‌లో మాత్రమే సంతోషంగా ఉంది. ఎప్పుడు అయితే సుస్మితతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందో అప్పటి నుంచి ఉదయ్ పడుతూ పడుతూ చివరకు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయాడు.
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల ఫంక్షన్లకు గెస్టుగా వెళ్లిన ఉదయ్ చివరకు విషిత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అన్నవరంలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం చూసి అందరూ షాక్ అయ్యారు. చివరకు తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ఉదయ్ 2014లో తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉదయ్ కెరీర్ అర్దాంతరంగా ముగిసిపోయింది.
ఇక ఉదయ్‌కిరణ్ భార్య విషత గురించి అప్పుడప్పుడు వార్తలు రావడం మినహా వాళ్ల ఫ్యామిలీ గురించి ఏ వార్తా బయటకు వచ్చేదే కాదు. అయితే ఉదయ్‌కిరణ్ సిస్టర్ కూడా టాలీవుడ్లో ప్రముఖ సింగరే. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సింగర్ ఎవరో కాదు పర్ణిక మాన్య. మాన్య రాజమౌళి విజువల్ వండర్ బాహుబలిలో పాటలు పాడింది. కరీంనగర్ జిల్లాకు చెందిన పర్ణిక డిగ్రీ పూర్తి చేసి తర్వాత లైట్ మ్యూజిక్ సంగీత ఆచార్యులు రామాచారి దగ్గర శిక్షణ తీసుకుంది.
కొన్ని టీవీ షోలు కూడా చేసింది. ఆ తర్వాత పాటలు పాడడం మొదలు పెట్టి 60కు పైగా సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. కేవలం సింగర్‌గానే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో పర్ణిక బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు.. టాప్ సింగర్ గీతామాధురి. గీత – పర్ణిక కలిసి ఎంతో స్నేహంగా ఉంటారు. ఇక కరోనా లాక్డౌన్ టైంలో వీరిద్దరు కలిసి చేసిన ఎన్నో వీడియోలు ప్రేక్షకులను మెప్పించాయి.
ఇక ఉదయ్ కిరణ్‌కు పర్ణికకు ఉన్న రిలేషన్ ఏంటంటే… పర్ణిక మాన్యకు ఉదయ్ అన్న వరస అవుతాడు. పర్ణిక పెదనాన్న కొడుకే ఉదయ్. ఏదేమైనా పర్ణిక ఇండస్ట్రీలో కొంతవరకు అయినా తనదైన ముద్ర వేసుకుంటే ఉదయ్ పేరు నిలబెట్టినట్టే…!