సౌత్ ఇండియాలోనే క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నయనతార అంటే అందరికి ఇష్టమే. వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా..సినిమాల పరంగా మాత్రం ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. సినిమా సినిమాకి తనలోని వేరియేషన్స్ చూయింస్తూ..స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తుంది. అంతేనా, హీరోయిన్స్ లల్లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా సరికొత్త రికార్డ్ నెలకోల్పింది. రీసెంట్ గానె పెళ్ళి చేసుకుని..మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న నయన ప్రజెంట్ రెండు బడా ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.
అయితే, రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో హోస్ట్ కరణ్ ..నయనతార పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఆయంకు ఎందుకు అంత కోపం నయన్ అంటే అంటూ మండిపడుతున్నారు. పూర్తి వివరాలోకి వెళ్లితే..కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ అనే షో చేస్తున్న సంగతి తెలిస్ డిస్ని హాట్ స్టార్ లో ఈ షో టెలికాట్ అవుతుంది. రీసెంట్ గా ఈ షోకి సమంత గెస్ట్ గా వచ్చింది. తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించిన సమంత..నాగ చైతన్య తో డివర్స్ పై కూడా స్పందించింది.
అయితే, ఈ క్రమంలోనే సమంత..నయనతార తో ఉన్న బంధం గురించి చెప్పుకొస్తూ..”తను చాలా మంచిదని..మేమొ ఖృఖ్ షూటింగ్ టైంలో చాలా క్లోజ్ అయిపోయాం..” అని చెప్పుకొచ్చింది. నయనతారతో కలిసి ఒక ప్రాజెక్టు చేశాను ఆ ప్రాజెక్ట్ చివరి రోజు ఆమె ఎమోషనల్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చింది. దానికి కరణ్ జోహార్ స్పందిస్తూ ఓకే అవునా నాట్ ఇన్ మై లిస్ట్ అంటే నా లిస్టులో ఆమె లేదు అంటూ కామెంట్ చేశాడు. దీంతో అతడి పై నయన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సౌత్ లోనే క్రేజీ హీరోయిన్ ఆమె నే అలా అంటావా..నీకు మైండ్ దొబ్బింది అంటూ..కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి దీని పై నయన్ ఎలా స్పందిస్తుందో..?