బుల్లి తెర పై ఓ రేంజ్ లో పాపులర్ అయిన జబర్దస్థ్ షో..ఇప్పుడు సోషల్ మీడియా లో బూతులు తిట్టించుకునే స్దాయికి దిగిజారిపోయింది. ఒకప్పుడు కామెడీ కోసం ఈ షో ని చూసే జనాలు..ఇప్పుడు ఢబుల్ మీనింగ్ డైలాగులు కోసమే చూసే పరిస్ధితి దాపురించింది. రాను రాను షో వల్గర్ డైలాగ్స్ ఎక్కువ అయిపోవడం..దారుణంగా కామెంట్స్ చేయడంతో ఈ షో డౌన్ ఫాల్ అయ్యింది. ఇక అదే టైంలో ఈ షోలో పని చేస్తున్న కమెడీయన్స్ కి మంచి ఆఫర్లు రావడంతో..అందరు వచ్చిన ఆఫర్స్ ని పంచుకుంటూ వెళ్లిపోయారు.
ఏదో ఉన్న వాళ్ళతో షో ని నడిపించుకుంటున్న ‘జబర్దస్త్’ మేనేజర్ ఏడుకొండలు..పై వెళ్లిపోయిన కొందరు ఎక్స్ కంటెస్టెంట్లు..”అక్కడ నరకం చూశామని, డబ్బులు ఇవ్వరు అని, టార్చర్ చేశారని..ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కాదు “అని..కొంచెం ఘాటుగానే స్పందించారు. దానికి తగ్గట్లే జబర్ధస్త్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ కూడా జంప్ అయిపోయాడు. దీంతో ఈ జబర్ధస్త్ పై నానా రకాల వార్తలు వైరల్ అయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన ‘జబర్దస్త్’ మేనేజర్ ఏడుకొండలు..మ్యాటర్ మొత్తం బయట పెట్టేసి..కొందరు జబర్ధస్త్ పాత కంటెస్టెంట్లను ఏకిపారేశాడు. “ఒక్కప్పుడు వీళ్ళంత జబర్ధస్త్ వల్లే ఫాంలోకి వచ్చారని..కానీ, ఇప్పుడు నాలుగు రూపాయలు , నలుగురు ఫ్యాన్స్ వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కాయని” మండిపడ్డారు. మరీ ముఖ్యంగా..సుడిగాలి సుధీర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. “ఇంత లైఫ్ ఇచ్చిన నేను..ఓ మాల్ ఓపెనింగ్‌కి రమ్మని అడగడానికి కాల్ చేస్తే మేనేజర్ తో మాట్లాడమన్నాడు. నేను చాలా సార్లు ఎందుకు జబర్ధస్త్ షో నుండి ఎందుకు తప్పుకున్నాడు అని అడుగుదామని చాలా సార్లు ఫోన్ చేశాను. కానీ అతడు లిఫ్ట్ చేయలేదు.. మళ్లీ కాల్ బ్యాక్ చేయలేదు.
ఏమన్నా అంటుంటే..సినిమాలో వీళ్ళు బిజీగా ఉన్నారంటున్నారు. అసలు వీళ్ళు హీరోలుగా చేసిన ఒక్కతి అంటే ఒక్క సినిమా ఏదైనా ఆడిందా..?’ అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాదు..ఆ తర్వాత సుడిగాలి సుధీర్ కు లైవ్ లో ‘జబర్దస్త్’ మేనేజర్ ఏడుకొండలు కాల్ చేశాడు. నిజంగానే సుధీర్ లిఫ్ట్ చేయలేదు. దీంతో జనాలకు కొత్త డౌట్లు మొదలైయ్యాయి. కొందరు అయితే, సుధీర్ పద్ధతి పై ఫైర్ అవుతున్నారు.. అన్నం పెట్టిన షో ని వదులుకున్నావా..అంటూ మండిపడుతున్నారు. మరి చూడాలి దీని పై సుధీర్ ఎలా రియాక్ట్ అవుతాడొ..?