ఎట్టకేలకు మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళుతోంది. అసలు సర్కారు వారి పాట వచ్చి చాలా రోజులు అయ్యింది. ఇటు త్రివిక్రమ్ కూడా రెండున్నరేల్లుగా ఖాళీగానే ఉన్నాడు. అయితే కథలో మహేష్ చెప్పిన కొన్ని మార్పుల వల్లే ఈ సినిమా ఇంకా సెట్స్‌మీదకు వెళ్లలేదన్న గాసిప్‌లు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుండడంతో మహేష్ రెమ్యునరేషన్ గురించి మరో చర్చ నడుస్తోంది.
మామూలుగా మహేష్ ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు రు. 50 – 55 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కరోనా వచ్చాక కూడా మహేష్ రెమ్యునరేషన్ స్టడీగానే ఉంది. అయితే త్రివిక్రమ్ సినిమాకు ఏకంగా రు. 70 కోట్లు పక్కా అంటున్నారు. రు. 70 కోట్ల రెమ్యునరేషన్ అంటే పాన్ ఇండియా మార్కెట్ లేకుండా చూస్తే ఓన్లీ తెలుగు వరకు చూస్తే ఇది చాలా ఎక్కువే అనుకోవాలి.
మహేష్‌కే రు. 70 కోట్లు ఇస్తే.. త్రివిక్రమ్‌కు ఎలా లేదన్నా రు. 30 కోట్లు ఉంటుంది. వీరిద్దరికే రు. 100 కోట్లు బడ్జెట్ అంటే.. ఇక సినిమాలో మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర మేకింగ్ ఖర్చు, 100 రోజుల షూటింగ్ ఇవన్నీ చూస్తే బడ్జెట్ ఖచ్చితంగా రు. 180 కోట్లకు పైనే అవుతుంది. ఇంత మార్కెట్ చేసినా రు. 200 కోట్లకు మించి మార్కెట్ కావడం లేదు. అసలు ఏ ఉద్దేశంతో ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారో ? అర్థం కావడం లేదు.
అయితే మహేష్ రెమ్యునరేషన్ విషయంలో కాస్త తగ్గి ఉండాలన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సర్కారు వారి పాట అంత కాదు ఇంతకాదు అన్నారు.. కట్ చేస్తే ఎంత లేదన్నా ఈ సినిమా కొన్నవాళ్లు రు. 5-6 కోట్లకు కాస్త అటూ ఇటూగా నష్టపోయారు. భరత్ అనే నేను సినిమాకు కూడా లాభాలు అయితే పెద్దగా లేవు. సరిలేరు నీకెవ్వరు సినిమా పరిస్థితి అంతే. మహేష్ రెమ్యునరేషన్ విషయంలో మెట్టుదిగడు అట.
పైగా సూపర్‌స్టార్.. ఆయన స్థాయికి తగినట్టుగా హీరోయిన్లు, టెక్నీషీయన్లు, షూటింగ్ క్వాలిటీ ఉండాలి. పోనీ పాన్ ఇండియా మార్కెట్ మీద కాన్‌సంట్రేషన్ చేయలేదు. కేవలం తెలుగు మార్కెట్ వరకు కంపేరిజన్ చేసి ఇంత రెమ్యునరేషన్ అంటే మహేష్ సినిమా కొన్నవాళ్లెవ్వరికి లాభాలు రావడం లేదన్న కంప్లైంట్లు ఉన్నాయి. మహేష్ తన రెమ్యునరేషన్ ఓ రు. 10 – 15 కోట్లు తగ్గించుకుని రు. 50 – 55 కోట్లు తీసుకున్నా వచ్చే నష్టం ఏం ? ఉంటుంది.
అప్పుడు ఆయన సినిమా కొన్న వాళ్లు.. తీసిన వాళ్లు అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు. అంతే కాని రు. 10 – 15 కోట్ల రెమ్యునరేషన్ కోసం పట్టుబడితే మహేష్ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. నష్టాలు తప్పలేదు.. సినిమా ప్లాప్.. బిలో యావరేజ్ అన్న మాటలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది నెక్ట్స్ సినిమాల బిజినెస్ విషయంలో కూడా ఇంఫాక్ట్ చూపిస్తుంది. అందుకే మహేష్ ఇకనైనా రెమ్యునరేషన్ విషయంలో కాస్త పట్టువిడుపులతో ఉంటే మంచిదనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.