Moviesఅటు తండ్రి, ఇటు కొడుకుతోనూ న‌టించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే...!

అటు తండ్రి, ఇటు కొడుకుతోనూ న‌టించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే…!

సినిమా ప‌రిశ్ర‌మ‌లో కొన్ని వింతలు, విశేషాలు కూడా జ‌రుగుతూ ఉంటాయి. హీరోల‌కు ఇక్క‌డ లాంగ్ ర‌న్ ఉంటుంది. హీరోయిన్లు మ‌హా అయితే ఓ 10-12 ఏళ్లు ఇండ‌స్ట్రీలో ఉంటే గొప్ప‌. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ హీరోల‌కు చాలాసార్లు కుర్ర హీరోయిన్ల‌తో న‌టిస్తారు. హీరోల కంటే 10 – 20 ఏళ్ల వ‌యస్సు త‌క్కువ ఉన్న హీరోయిన్లే గ‌తి అవుతున్నారు. ఇక సినిమాల్లో తండ్రికి జోడీగా న‌టించిన హీరోయిన్లు.. ఆ త‌ర్వాత కొడుకు ప‌క్క‌న కూడా న‌టించిన సంద‌ర్భాలు చాలా మంది హీరోయిన్ల విష‌యంలో జ‌రిగాయి.

తండ్రి సినిమాల్లో న‌టించిన హీరోయిన్లు, ఇటు కొడుకు సినిమాల్లోనూ క‌నిపించారు. అలా తండ్రి, కొడుకులు ఇద్ద‌రు సినిమాల్లోనూ క‌నిపించిన ఆ హీరోయిన్లు ఎవ‌రో చూద్దాం.
1- శ్రీదేవి :
అతిలోక అందాల సుంద‌రి ముందు ఏఎన్నార్‌కు జోడీగా ఎన్నో హిట్ సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత ఆయ‌న కుమారుడు నాగార్జున‌కు జోడీగా ఆఖ‌రుపోరాటం, గోవిందా గోవిందా సినిమాలు కూడా చేసింది.
2- కాజ‌ల్ :
కాజ‌ల్ ముందుగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా మ‌గ‌ధీర సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత నాయ‌క్ కూడా చేసింది. ఆ త‌ర్వాత చిరంజీవికి జోడీగా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో న‌టించింది.

3- ర‌కుల్‌ప్రీత్‌సింగ్ :
ర‌కుల్‌ప్రీత్ ముందుగా నాగ‌చైత‌న్య‌తో న‌టించింది. చైతుతో రారండోయ్ వేడుక‌చూద్దాం సినిమా చేశాక నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2లో న‌టించింది. అయితే మ‌న్మ‌థుడు 2 సినిమాలో ర‌కుల్ – నాగార్జున జంట‌పై విమ‌ర్శ‌లే ఎక్కువుగా వినిపించాయి.
4- త‌మ‌న్నా :
మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ముందు రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ చేసింది. ఆ త‌ర్వాత చిరుతో క‌లిసి సైరాలో న‌టించింది. ఇప్పుడు మ‌రోసారి చిరుతోనే భోళాశంక‌ర్ చేస్తోంది.

5- లావ‌ణ్య త్రిపాఠి :
సొట్ట‌బుగ్గ‌ల లావ‌ణ్య త్రిపాఠి ముందుగా నాగ‌చైత‌న్య‌తో చేశాక‌.. ఆ త‌ర్వాత నాగార్జున‌తో సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమా చేసింది.
6- మాధురి దీక్షిత్ :
మాధురి దీక్షిత్ ముందు రిషిక‌పూర్‌తో చేశాక ఆ త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌పూర్‌తో కూడా క‌లిసి న‌టించింది.
7- డింపుల్ కపాడియా :
డింపుల్ క‌పాడియా ఎప్పుడో ధ‌ర్మేంద్ర‌కు జోడీగా న‌టించింది. ఆ త‌ర్వాత ధ‌ర్మేంద్ర పెద్ద కొడుకు స‌న్నీడియోల్‌తో కూడా క‌లిసి న‌టించింది.

8-రాణి ముఖర్జీ :
ముందు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ‌చ్చ‌న్‌తో న‌టించిన రాణిముఖ‌ర్జీ ఆ త‌ర్వాత అభిషేక్‌తో కూడా చేసింది.
9- అమృత సింగ్ :
అమృత‌సింగ్ ధ‌ర్మేంద్ర‌, స‌న్నీడియోల్ ఇద్ద‌రితోనూ న‌టించింది.
10- రీనా రాయ్ :
రీనా రాయ్ సునీల్ ద‌త్‌, సంజ‌య్‌ద‌త్ ఇద్ద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

11- రాధా :
సీనియ‌ర్ న‌టి రాధ శివాజీ గ‌ణేష‌న్‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు ప్ర‌భుతో కూడా న‌టించింది.
12- కీర్తి సురేష్ :
అల‌నాటి న‌టి మేనక కూతురు అయిన మ‌హాన‌టి కీర్తి సురేష్ సీనియ‌ర్ న‌టుడు విక్ర‌మ్‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు ధృవ్‌తో కూడా న‌టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news