నటి పూర్ణ..ఈ పేరుకు కొత్తగా పరిచయాలు చేయవలిసిన అవసరం లేదు. తన కెరీర్ స్టార్టింగ్ లో సినిమా అవకాశాల కోసం..ఫస్ట్ హిట్ కోసం చాలా కష్టపడినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ ఆ తరువాత తన సొంత టాలెంట్ తో..నటనతో మెప్పించి..శభాష్ అనిపించుకుంది. హీరోయిన్లు గా సినిమాలు చేసినా.. ఢీ షో ద్వారానే పాపులర్ అయ్యింది.
ఆ షో పుణ్యమా అంటూ జడ్జీగా చేస్తూనే సినిమాలో మంచి మంచి అవకాశాలు కొట్టేసి.. పలు ఈవెంట్స్ లోను హాట్ పర్ ఫామెన్స్లు ఇచ్చి..తన లోని నటనా టాలెంట్ ని అందరికి చూయించింది. ఇక అలా అమ్మడుకి ఢీ షో మరో లైఫ్ ఇచ్చింది. ఇటీవలే పూర్ణ తలైవి, అఖండ, దృశ్యం 2 వంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించి..మెప్పించింది. కాగా, ఈ మధ్యనే తనకు కాబోయే భర్తని పరిచయం చేసిన ఈ అమ్మడు రీసెంట్ గా.. నిశ్చితార్ధం చేసుకుంది.
వీళ్ల పెళ్ళి నవంబరులో జరుగుతుందని..ఇది వరకే ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది పూర్ణ. కాగా, ఇటీవల జరిగిన పూర్ణ నిశ్చితార్ధం ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. పూర్ణ పెళ్లి చేసుకోబోతుంది.. షానిద్ ఆసిఫ్ ఆలీ. ఇతను ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ . జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ ఫౌండర్ అండ్ సీఈఓ అని తను కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అని తెలిసింది. కాగా, కేవలం నిశ్చితార్ధం కోసమే..ఆయన 2 కోట్లు ఖర్చు చేసిన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిశ్చితార్ధం రింగ్ కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు అయ్యిందట. నిశ్చితార్ధమే ఈ రేంజ్ లో చేస్తుంటే..ఇక పెళ్ళి ఏ రేంజ్ లో చేస్తారో అంటూ ముక్కున వేళ్లు వేసుకుంటున్నారు ప్రముఖులు. మరో పక్కన నెటిజన్స్ అయితే..పూర్ణ భర్త అంత రిచ్ అబ్బాయా..అంత డబ్బులు ఎలా వచ్చాయి..అంటు చర్చించుకుంటున్నారు.