ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరని అడిగితే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. ఇప్పటి వరకూ ఫ్లాప్ లు ఎరగని దర్శకుడిగా వరుస హిట్ లతో దూసుకుపోతున్నారు. రాజమౌళి సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆశ్వాదిస్తారు. 20 ఏళ్ల కెరీర్‌లో 12 వరుస హిట్లు. అందులో సగం ఇండస్ట్రీ హిట్లు అంటే మామూలు విషయం కాదు. ఇక ప్రతి మగవాడి విజయం వెనక ఆడది ఉంటుందంటారు. అదే విధంగా రాజమౌళి విజయం వెనక కూడా ఆయన సతీమణి రమా రాజమౌళి ఉన్నారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటారు.
రాజమౌళి కెరీర్ ప్రారంభంలో మిగతా దర్శకుల మాదిరిగానే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో రాజమౌళితో రమా ఉన్నారు. ఇక వీరిద్దరి ప్రేమ వివాహంలో ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి. వీరి జంట ఆదర్శ భావాలు కలిగిన జంట. ఇక రాజమౌళి పెద్దనాన్న కుమారుడే ఎంఎం కీరవాణి. కాగా ఆయన భార్య పేరు శ్రీ వల్లి. ఇక వల్లి సోదరే రమా. అయితే అప్పటికే రమాకు వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో రమా భర్తతో విడాకులు తీసుకుంది.
ఆ తరవాత రాజమౌళి రమతో ప్రేమలో పడ్డారు. భర్తకు విడాకులు ఇచ్చేశాక రమ తన సోదరి శ్రీవల్లి ఇంట్లోనే ( అంటే కీరవాణి) ఉండేది. అక్కడే రాజమౌళితో ఆమెకు స్నేహం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. ఆమె క్రమశక్షణ…మంచి తనం రాజమౌళికి తెగనచ్చడంతో అప్పటికే కొడుకు ఉన్నా కూడా ఆమెను వివాహం చేసుకున్నాడు. అంతే కాకుండా పెళ్లి తరువాత రమా – రాజమౌళి ఒక అమ్మాయిని దత్తత తీసుకుని సొంత కూతురుగా పెంచుకుంటున్నారు. ఆమె పేరు మమూఖ.
రమా – రాజమౌళిల వివాహం 2001లో జరిగింది. వీరి పెళ్లికి ముందు రాజమౌళి సీరియల్స్ కు మాత్రమే దర్శకత్వం వహించారు. వీరిద్దరి పెళ్లి తరవాతే ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా వచ్చింది. ఆ తరవాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు రమానే డిజైనర్ గా పనిచేశారు. ఇక వీరిద్దరూ తమకు మళ్లీ పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నారు. రమా – రాజమౌళి తమ కుమారుడు కార్తికేయకు ఇప్పటికే వివాహం కూడా జరిపించారు.
కార్తీకేయ భార్య ఎవరో కాదు జగపతిబాబు అన్న కుమార్తే. ప్రస్తుతం కార్తీకేయ రాజమౌళి సినిమాల వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అలాగే క్రియేటివ్ హెడ్‌గా ఉంటున్నాడు. సినిమాల ట్రైలర్స్ కట్ చేయడంతో పాటు ఇతర విభాగాల్లోనూ పని చేస్తున్నాడు. కార్తీకేయ త్వరలోనే దర్శకత్వ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక రాజమౌళి కుమార్తె మయూఖ ప్రస్తుతం చదువుకుంటోంది.