టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ అయ్యి రెండు దశాబ్దాలు దాటుతోంది. అసలు ఇప్పుడు ఉన్నంత ఫామ్‌లో ఎన్టీఆర్ ఎప్పుడూ లేడు. ఏకంగా ఆరు వరుస హిట్లు.. అందులోనూ త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా హిట్.. ఇప్పుడు లైన్లో ఉన్నవి అన్నీ కూడా పాన్ ఇండియా హిట్లే. ఈ రేంజ్ హిట్లు.. ఈ రేంజ్ రెమ్యునరేషన్.. ఇప్పుడు ఉన్నంత పాజిటివ్ వైబ్స్, ఫాలోయింగ్ ఎన్టీఆర్‌కు కెరీర్ పరంగా ఎప్పుడూ లేదు.
17 ఏళ్లకే హీరోగా వచ్చి 21 ఏళ్లకే మూడు హిట్లు స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి హిట్లతో టాలీవుడ్ స్టార్ హీరో అయిపోయిన ఎన్టీఆర్ కెరీర్ పరంగా రెండుసార్లు తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడంతో పాటు రెండు ఎదురు దెబ్బలు తిన్నారు. భయంకరమైన ఇండస్ట్రీ హిట్ల తర్వాత ఎన్టీఆర్ ను అభిమానులు, సినీ లవర్స్ ఓ రేంజ్‌లో ఊహించుకున్నారు. మళ్లీ ఆ స్థాయి హిట్ పడేవరకు ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా హిట్ కాలేదు.
రాఖీకి ముందు ఎన్టీఆర్ బాగా లావైపోయాడు. మామూలుగానే నందమూరి జీన్స్ ప్రకారం చూస్తే ఆ ఫ్యామిలీ వాళ్లు కాస్త బొద్దుగానే ఉంటారు. అయితే రాఖీ టైంకు మరీ లావెక్కిపోవడంతో అసలు ఫ్యాన్స్ కూడా చూసేందుకు జీర్ణించుకోలేకపోయారు. అయితే అద్భుతమైన, మతులు పోయే తన నటనతోనే రాఖీ సినిమాను లాక్కువచ్చాడు. ఆ టైంలో ఎన్టీఆర్ పనైపోయింది. ఇక హీరోగా పనికిరాడు.. కెరీర్ కూడా క్లోజ్ అయిపోయిందన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫిజిక్ అలా ఉంది.
తర్వాత యమదొంగ సినిమా కోసం తన మేకోవర్‌ను ఎవ్వరూ ఊహించనంతగా మార్చేసుకున్నాడు. మయదొంగ కోసం లుక్ మార్చుకున్నా కూడా ఎన్టీఆర్ ఫేస్‌లో ఆ ఛరిష్మా అయితే తగ్గింది. అయితే ఆ తర్వాత కంత్రి, అదుర్స్ సినిమాల నుంచి మళ్లీ ఫుల్ ఎనర్జిటిక్ అయిపోయాడు. డ్యాన్సులతో తెరమీద చెలరేగిపోయాడు. బృందావనంలో అయితే ఎంత అందంగా ఉన్నాడో చెప్పక్కర్లేదు.
అలా కెరీర్‌లో ఓ సారి కిందపడి పైకి లేచిన ఎన్టీఆర్ రెండోసారి బ్యాడ్ పీరియడ్ ఎదుర్కొన్నాడు. దమ్ము, శక్తి, రామాయ్యా వస్తావయ్యా, రభస లాంటి ప్లాపులు పడ్డాయి. పైగా అప్పుడు నందమూరి ఫ్యామిలీతో గ్యాప్ ఉంది. వరుసగా ప్లాపులతో మార్కెట్ డౌన్ అయిపోయింది. అలాంటి టైంలో టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ అప్రతిహత విజయప్రస్థానం మొదలైంది. వరుసగా టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత – త్రిబుల్ ఆర్ ఇలా ఆరు వరుస హిట్లు పడ్డాయి.
ఇది కెరీర్‌లో టాప్ గ్రాఫ్.. పైగా లైన్లో ఉన్నవి అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులు.. అందరూ క్రేజీ డైరెక్టర్లే. ఇలా కెరర్ అయిపోయిందని రెండుసార్లు విమర్శలు ఎదుర్కొన్న ఎన్టీఆర్ చివరకు తన నటనతోనే సమాధానం చెప్పి ఇప్పుడు ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.