Moviesస‌మంత VS చైతు వార్‌కు బ్రేక్‌... మొత్తానికి స‌మంతే వెన‌క్కి త‌గ్గిందిగా..!

స‌మంత VS చైతు వార్‌కు బ్రేక్‌… మొత్తానికి స‌మంతే వెన‌క్కి త‌గ్గిందిగా..!

టాలీవుడ్‌లోనే క్యూట్ క‌పుల్స్‌లో ఒక‌రిగా స‌మంత – చైతుకు ఎంతో క్రేజ్ ఉండేది. అస‌లు వీళ్లిద్ద‌రు ఏం చేసినా ఓ సంచ‌ల‌న‌మే అయ్యేది. వీరిద్ద‌రు భార్య‌భ‌ర్త‌లుగా ఉన్న‌ప్పుడు చిన్న ఫొటో సోష‌ల్ మీడియాలో పెట్టినా ద‌ద్ద‌రిల్లిపోయేది. వీళ్లు ఎక్క‌డికి అయినా టూర్ల‌కు వెళ్లారంటే చాలు మామూలుగా ర‌చ్చ చేసేవాళ్లు కాదు. వీళ్లు భార్య‌భ‌ర్త‌లుగా క‌లిసి మ‌జిలీ సినిమా చేయ‌డ‌మే పెద్ద సంచ‌ల‌నం. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌జిలీ సినిమా త‌ర్వాత వీరి మ‌ధ్య స‌డెన్‌గా మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం.. చ‌క‌చ‌కా నాలుగు నెల‌ల్లోనే విడిపోవ‌డం జ‌రిగిపోయింది.

వీరు విడిపోయిన త‌ర్వాత కూడా ఎవ‌రి దారుల్లో వారు వెళుతూ హ్యాపీగా ఉన్నారు. విడాకుల త‌ర్వాత స‌మంత వెబ్‌సీర‌స్‌లు, బాలీవుడ్ సినిమాల‌తో పాటు తెలుగులో య‌శోద‌, శాకుంతలం, ఖుషీ సినిమాలు చేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి యంగ్ క్రేజీ హీరోతో పెళ్ల‌య్యి.. విడాకులు అయ్యాక కూడా రొమాన్స్ అంటే ఆమె క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక పుష్ప‌లో ఐటెం సాంగ్‌లో అందాలకు జ‌నాలు మ‌త్తెక్కిపోయి ఉన్నారు.

ఇక విడాకుల త‌ర్వాత ఎవ‌రికి వారు పంతంతో ఉన్న‌ట్టే ఉన్నారు. ఇటు చైతు కూడా వ‌రుస హిట్ల‌తో ఫామ్‌లో ఉన్నాడు. స‌మంత న‌టించిన థ్రిల్ల‌ర్ సినిమా య‌శోద‌ను ఆగ‌స్టు 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి పోస్ట‌ర్లు, అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్లు కూడా వ‌చ్చాయి. ఈ సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందే నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న లాల్ చ‌ద్దా మూవీ 11న వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌స్తోంది. బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌తో క‌లిసి చైతు న‌టిస్తున్నాడు. చైతుకు ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ.

దీంతో కావాల‌నే స‌మంత య‌శోద‌ను ఆగ‌స్టు 12న వేశార‌న్న టాక్ కూడా వ‌చ్చింది. ఈ ఇద్ద‌రి సినిమాల్లో ఎవ‌రి సినిమా పై చేయి సాధిస్తుంద‌న్న ఆస‌క్తి కూడా ఉంది. వాస్త‌వంగా చూస్తే చైతుది బాలీవుడ్ సినిమా కావ‌డంతో ఇక్క‌డ పెద్ద పోటీ ఉండ‌దు.. య‌శోద‌కే య‌డ్జ్ ఉంటుంద‌ని అనుకున్నారు. అయితే పోటీ విష‌యంలో స‌మంత సినిమానే వెన‌క్కు త‌గ్గింది. య‌శోద సినిమాను పోస్ట్ పోన్ చేశారు.

ఇంకేముంది సోష‌ల్ మీడియాలో కొంద‌రు చైతు అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ .. మొత్తానికి చైతుతో పోటీ విష‌యంలో స‌మంతే ఒక్క అడుగు వెన‌క్కు త‌గ్గి త‌న సినిమా వాయిదా వేసుకుందని.. ఆమె భ‌య‌ప‌డింద‌ని కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఈ రెండు సినిమాల రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ? చూడాలి.

Latest news