నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన భారీ పీరియాడిక్ ఫిక్షన్ బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీతో మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కేథరిన్ థెస్రా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 5వ శతాబ్దానికి చెందిన మగధ సామ్రాజ్యాధినేత బింబిసారుడు కథతో ఫాంటసీ ఫిక్షన్ మూవీగా బింబిసార తెరకెక్కింది. మగధీర సినిమాలోలా అటు 5వ శతాబ్దానికి ఇటు 2022కు లింక్ పెడుతూ కథనం సాగుతుందని అంటున్నారు.
కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 5న రిలీజ్ అవుతోంది. కళ్యాణ్‌రామ్‌కు గత ఆరేడేళ్లలో పటాస్ తర్వాత 118 సినిమా మాత్రమే మంచి సక్సెస్ అయ్యింది. ఇక బింబిసార సినిమాకు రు. 50 కోట్ల బడ్జెట్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా ఈ సినిమాకు పెట్టిన ఖర్చు రు. 36 కోట్లు అని అంటున్నారు. ఏపీ, తెలంగాణ టోటల్ రైట్స్ కలిపి రు. 15 కోట్లకు దిల్ రాజుకు ఖాయమైందంటున్నారు. అది కూడా రిఫండబుల్ సిస్టమ్‌లో దిల్ రాజు ఈ మొత్తం చెల్లించాడని అంటున్నారు.
ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రు. 22 కోట్లకు అమ్ముడు పోయాయట. అంటే రు. 37 కోట్ల అమౌంట్ సినిమా రిలీజ్‌కు ముందే వచ్చేసింది. ఓవరాల్‌గా చూస్తే కళ్యాణ్‌రామ్ సేఫ్ అన్నమాటే. అంటే ఈ సినిమా ఇప్పటికే రు. కోటి టేబుల్ ప్రాఫిట్లో ఉందని చెప్పాలి. సినిమా క్వాలిటీ విషయంలో కళ్యాణ్‌రామ్ ఎక్కడా రాజీపడలేదని క్లారిటీగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటేనే ఎంత గ్రాండియర్‌గా ఉందో అర్థమవుతోంది.
మగధీర స్టైల్ తరహా సినిమా కావడంతో ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే అంటున్నారు. ఇటు ఎప్పుడూ లేనట్టుగా ఎన్టీఆర్‌తో పాటు బాలయ్య అభిమానుల సపోర్ట్ కూడా బింబిసారకు పుష్కలంగా ఉంది. ఏదేమైనా పటాస్ సినిమాకు ముందు ఎలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో ఇప్పుడు బింబిసారకు కూడా అంతే పాజిటివ్ ట్రెండ్ అయితే క్రియేట్ అవుతోంది.