టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న సమంత కు ఈ మధ్య ట్రోలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. గతం లో అమ్మడుని దేవతలా చూసిన వారే..ఇప్పుడు రాక్షసి లా చూస్తున్నారు. దానికి రీజన్ కూడా మనకు తెలిసిందే..అక్కినేని నాగ చైతన్య కు విడాకులు ఇచ్చిన తరువాత సమంత పై గుర్రుగా ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. అంతేకాదు, ఆమె విదాకుల తరువాత పెట్టే రకరకాల పోస్ట్లు కూడా అభిమానులకు మండిస్తున్నాయి. పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీ పరువు తీస్తుంది అంటూ మండిపడుతున్నారు.
అయితే, విడాకుల తరువాత సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్న సమంత..గత కొన్ని రోజుల నుండి..సైలెంట్ అయిపోయింది. దానికి కారణం టెక్నికల్ గ్లిచ్ అయినా..తెర పై వినిపిస్తున్న కారణం మాత్రం..మరోలా ఉంది. సమంత కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ సినిమాల పై దృష్టి సారించాలి అనుకుంటుందట. అందుకోసమే..సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని చూస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
ఒక్కవేళ అదే నిజమైతే..సమంత, పరోక్షంగా అక్కినేని అభిమానులకు ఫేవర్ చేసిన్నట్లే అంటున్నరు ఫ్యాన్స్. సమంత సోషల్ మీడియాకి దూరం అయితే..ఆమె టార్చర్ తప్పించుకున్నట్లే అంటూ సంతోషపడుతున్నారు. సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ.. మధ్య మధ్యలో బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ రెండు చేతులా సంపాదించేది. మరి ఎందుకో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుని తన అభిమానులకు షాక్ ఇచ్చింది.