Movies" మహాత్మ " హీరోయిన్‌పై దారుణంగా లైంగీక దాడి.. కారులో బ‌ట్ట‌లు...

” మహాత్మ ” హీరోయిన్‌పై దారుణంగా లైంగీక దాడి.. కారులో బ‌ట్ట‌లు చింపేసి.. గంట‌ల పాటు న‌ర‌కం…!

మళ‌యాళ చిత్ర పరిశ్రమ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో నటి భావన మీనన్ కూడా ఒకరు. భావన మీనన్ తండ్రి సినిమాటోగ్రాఫర్ కావడంతో ఆమెకు చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. దాంతో 16 ఏళ్ల వయసులోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరవాత హీరోయిన్ అవ్వాలనే కలలను భావన నిజం చేసుకుంది. దాదాపు భావన 82 సినిమాలలో నటించింది. ఆమె త‌న‌ నటనతో అవార్డులను సైతం అందుకుంది. ఇక టాలీవుడ్ లో భావన హీరో, మహాత్మ, ఒంటరి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ మూడు సినిమాలలో మహాత్మ సినిమాతో భావనకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.

తెలుగు కంటే మళ‌యాళంలోనే ఎక్కువ ఆఫర్లు ఉండటంతో భావన మళ్లీ అక్కడకే వెళ్లి స్థిరపడింది. కాగా 2017 లో జరిగిన ఓ సంఘటనతో భావన జీవితంలో చీకటి అధ్యాయం మొదలైంది. 2017 ఫిబ్రవరి నెలలో భావనపై కారులో లైంగిక దాడి జరిగింది. 2017 ఫిబ్రవరి 17వ తేదీన భావన కొచ్చిలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంది. షూటింగ్ అనంతరం తన కో స్టార్, దర్శకుడు అయిన లాల్ ఇంటికి కారులో బయలుదేరింది. మార్గమధ్యంలో భావనను కొంతమంది కిడ్నాప్ చేశారు. భావన డ్రైవర్ దుండగులకు సహకరించడంతో సులువుగా కిడ్నాప్ చేయగలిగారు.

కారులో ఆమె దుస్తులు చింపేసి రెండు గంటల పాటు నరకం చూపించారు. అంతేకాకుండా లైంగీక దాడికి పాల్పడుతున్న సమయంలో ముందు సీట్ లో కూర్చున్న వ్యక్తి భావనను వీడియో తీసినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. రెండు గంటల తర్వాత భావనను నటుడు లాల్ ఇంటివద్ద దుండగులు వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే చిరిగిన దుస్తులతో భావన లాల్ ఇంట్లోకి ప్రవేశించింది. నటుడు లాల్ సహాయంతో భావన అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ వార్త అప్పట్లో దక్షిణాదిని కుదిపివేసింది. ఈ విషయంపై భావన ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ తనపై ఇలా దాడి చేపించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే మళ‌యాళ ఇండస్ట్రీ మొత్తం దిలీప్ కుమార్‌కే సపోర్ట్ చేసింది. అతడు స్టార్ నటుడు కావడంతో అతడికి మద్దతు తెలుపుతూ భావనకు సినిమా అవకాశాలు ఇవ్వద్దంటూ నిర్ణయం తీసుకున్న నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ పోలీసుల విచారణలో దిలీప్ కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్టు నిర్ధారణ అయింది. దాడికి పాల్పడిన దుండగులు సైతం దిలీప్ కుమార్ పేరును బయటపెట్టారు. దాంతో దిలీప్ కుమార్ మూడు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు.

ఇప్పటికీ భావన ఈ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. తనలా మరొకరికి జరగకూడదని దిలీప్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని భావన డిమాండ్ చేస్తోంది. అతడి వల్లే తన కెరీర్ నాశనం అయిపోయిందని భావన ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. మరోవైపు భావన రీ ఎంట్రీకి కూడా సిద్దం అవుతున్నట్టుగా మాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news