Moviesవిడాకుల దిశ‌గా అడుగులు వేస్తోన్న మ‌రో టాలీవుడ్ యంగ్ హీరో...!

విడాకుల దిశ‌గా అడుగులు వేస్తోన్న మ‌రో టాలీవుడ్ యంగ్ హీరో…!

ఓవ‌రాల్‌గా ఇండియ‌న్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొంత కాలంగా విడాకుల సంస్కృతి పెరిగిపోతోంది. మ‌హామ‌హులు అయిన సెల‌బ్రిటీలు సింపుల్‌గా విడాకుల బంధంతో విడిపోతున్నారు. ఏళ్ల‌కు ఏళ్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని.. పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు అయ్యాక కూడా వీరు బంధాన్ని సింపుల్‌గా తుంచేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్‌లో ఈ విడాకుల సంస్కృతి ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది.

ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు విడాకుల‌తో తమ బంధానికి బ్రేక‌ప్ చెప్పేసుకుంటున్నారు. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో ఒక‌టి రెండేళ్లోల చూస్తేనే అమీర్ ఖాన్ – కిర‌ణ్ రావు ఏళ్ల బంధాన్ని తెంపేసుకున్నారు. ఇక ధ‌నుష్ – ఐశ్వ‌ర్య దంప‌తుల 17 ఏళ్ల బంధం అలాగే తెగిపోయింది. స‌మంత – నాగ‌చైత‌న్య అయితే నాలుగేళ్ల‌కే విడిపోయారు. సౌత్ ఇండియ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ డి. ఇమాన్ కూడా భార్య‌కు విడాకులు ఇచ్చేశాడు.

ఇక తాజాగా ప్ర‌ముఖ గాయ‌కులు శ్రావ‌ణ భార్గ‌వి, హేమ‌చంద్ర ఇద్ద‌రూ కూడా విడాకులు తీసుకోబోతున్నార‌న్న వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోనే మ‌రో యంగ్ హీరో కూడా చేరిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వార్త‌లు జోరుగా చక్కెర్లు కొడుతున్నాయి. మీడియం రేంజ్ బ‌డ్జెట్ సినిమాల్లో న‌టిస్తూ మంచి హిట్లు కొడుతోన్న స‌ద‌రు హీరో క‌రోనా లాక్ డౌన్ టైంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు.

ఓ డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకున్న స‌ద‌రు యంగ్ హీరో గ‌తంలో న‌టించిన ఓ హిట్ సినిమాకు సీక్వెల్‌గా చేసిన సినిమా సైతం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట మ‌ధ్య ఆరు నెల‌లు తిర‌క్కుండానే అభిప్రాయ బేధాలు వ‌చ్చేశాయ‌ట‌. వీరిని క‌లిపి ఉంచేందుకు రెండు వైపులా కుటుంబాలు ఎంత స‌ర్ది చెప్పినా కూడా ఎవ్వ‌రూ విన‌డం లేద‌ట‌.

చివ‌ర‌కు వీరు విడాకులు తీసుకుని ఎవ‌రి జీవితాల‌ను వారు ఎంజాయ్ చేసేందుకే నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌నీసం చైతు – స‌మంత విడాకుల వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు స‌మంత అయితే మీకు బుర్ర ఉందా అంటూ ఖండించింది. ఇప్పుడు ఈ యంగ్ హీరో విడాకుల వార్త‌ల విష‌యంలో ఎవ్వ‌రూ ఖండించ‌క‌పోవ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కూడా వీరు విడిపోతున్నార‌న్న‌ది క‌న్‌ఫార్మ్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news