విక్రమ్.. కమల్ హాసన్ ను మళ్లీ నటుడిగా పుట్టించిన సినిమా ఇదే అని చేప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ అంటే ఏంటో తెలియని..ఆయనకు, ఈ సినిమా ద్వారానే హిట్ పడింది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 3న విడుదలై బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకుంది. కమల్ హాసన్ ని విమర్శించే వాళ్ళు కూడా ఈ సినిమాలో కమల్ నటన పై పోగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంత బాగా నటించి..అభిమానులను ఆకర్షించాడు కమల్.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. సినిమాకి వీళ్ళ నటన ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఫాహద్ ఫాజిల్ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించాడనే చెప్పాలి. అంత బాగా ఆకట్టుకుంది ఆయన నటన. ట్రెమండస్ టాక్ వచ్చిన నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీలో విక్రమ్ సాలిడ్ వసూళ్లు సాధిస్తుంది. వీకెండ్ ముగియకుండానే విక్రమ్ వరల్డ్ వైడ్ రూ. 100 కోట్ల గ్రాస్ దాటేసింది. దీంతో కోలీవుడ్ నాట కమల్ సరికొత్త రికార్డ్ నెలకోల్పాడు.
అయితే, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా అంటించారన్న సంగతి తెలిసిందే. నిజానికి సినిమాలో సూర్య ది గెస్ట్ రోల్ కానీ, కధను మలుపు తిప్పే పాత్ర ఈయనదే కావడం గమనార్హం. ఈ సినిమాలో సూర్య కేవలం ఐదు నిమిషాలే నటించినా..ఆ పాత్ర మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంది. సినిమాకు అదే పెద్ద అస్సెట్‌గా నిలిచిందని చాలామంది చెబుతున్నారు.
అయితే, ఇదే క్రమంలో ఈ క్యామియో పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎంత ఎంత పుచ్చుకున్నాడనే విషయంపై సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. అయితే స్టార్ హీరో సూర్య విక్రమ్ సినిమాలో నటించడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కమల్ సినిమా కావడంతో మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకొని షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు తప్పిస్తే ఎక్కడ కూడా రెమ్యూనరేషన్ గురించి అడగలేదట. దీంతో సూర్య అభిమానులు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.