MoviesNayanathara: పెళ్లి విషయంలో అందరూ అనుకుంది ఒకటి చివరికి అయింది ఒకటి..!

Nayanathara: పెళ్లి విషయంలో అందరూ అనుకుంది ఒకటి చివరికి అయింది ఒకటి..!

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార సినీ కెరీర్ ఎంత అద్భుతంగా సాగుతుందో అందరికీ తెలిసిందే. ప్రమోషన్స్‌కు హాజరవకపోయినా కూడా ఆమె దర్శకనిర్మాతలకు కావాలి. రెమ్యునరేషన్ కూడా భారీగా అందుకుంటుంది. ఆమె ఎన్ని కండీష‌న్లు పెట్టినా కూడా నయనతారే అందరికీ కావాలి. ఆమె నటించిన భారీ సినిమాలు ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినా కూడా నయనతారే డిమాండ్ త‌గ్గ‌దు. అలా ఉంది నయన్ క్రేజ్..ఇటు తెలుగులో అటు తమిళంలో. భారీ కమర్షియల్ సినిమాలే కాదు, ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌కి నయన్ కేరాఫ్ అడ్రస్.

ఆమె కూడా తన మీద నమ్మకం పెట్టుకొని కథ చెప్పడానికి వచ్చిన దర్శకనిర్మాతలను సాధ్యమైనంతవరకు డిసప్పాయింట్ చేయడం లేదు. కథ తనకు నచ్చి అందులో పాత్రకు సూటవుతానూ అనుకుంటే..కాస్త సమయం కావాలని అడిగి కూడా ప్రాజెక్ట్‌కు సైన్ చేస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కున్నా కూడా ఈ కారణాల వల్లనే నయన్ అందరికీ నయనంగా మారింది. వాస్తవంగా అయితే, నయన్ జీవితంలో జరిగిన సంఘటనలు మరో హీరోయిన్ విషయంలో అయితే, కృంగి కుశించిపోయి ట్రోల్స్, రూమర్స్‌కు తట్టుకోలేక అడ్రస్ లేకుండా పోయేది. కానీ, నయన్ గుండె గట్టిది.

అన్నిటినీ తట్టుకుంది. రెండుసార్లు ప్రేమలో విఫలమయినా నిలదొక్కుకుంది. ఒక్కసారి లైఫ్‌లో జరగరాని సంఘటన జరిగి స‌మ‌స్యలు చుట్టుముడితేనే తీవ్రమనోవేదనకు లోనై కెరీర్ దెబ్బతింటుంది. కానీ, నయన్ ఓ సారి శింబు వల్ల, ఓసారి ప్రభుదేవా వల్ల జీవితంలో ఎదురుదెబ్బలు తిన్నది. ఆ గాయాలు మానిన తర్వాత తన కెరీర్‌లోకి విఘ్నేష్ శివన్ వచ్చాడు. మూడవసారి కూడా నాయన్ మోసపోతుందా అని నయన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నన్నీ రోజులు నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

నయన్ – విఘ్నేష్ శివన్ రిలేషన్‌పై వచ్చిన వార్తలు రూమర్లు అన్నీ ఇన్నీ కావు. వీరిద్ద‌రి బంధంపై ఎక్కువగా నెగిటివ్‌గానే మాట్లాడుకున్నారు. చాలామంది నయన్‌కు పెళ్లి కాదని, ఇది కూడా మధ్యలోనే బ్రేక్ అవుతుందని కామెంట్స్ చేశారు. కానీ, తన పెళ్లి విషయంలో అందరూ మాట్లాడుకుంది ఒకటి. చివరికి జరిగింది ఒకటి. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోకుండా అత్యంత వైభవంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారమే కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులందరి సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.

తనకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరినీ నయన్ – విఘ్నేష్ పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లి డేట్ ప్రకటించిన తర్వాత కూడా వచ్చిన కామెంట్స్ చాలానే. అవన్నీ పట్టించుకోకుండా విఘ్నేష్‌ను పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టింది నయన్. ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చి భర్తతో ఎంజాయ్ చేస్తోంది. అయితే, నటనకు మాత్రం గుడ్‌బై చెప్పే ప్రసక్తే లేదని సన్నిహితుల వద్ద చెప్పిందట. కాబట్టి నయ‌న్‌ సినీ కెరీర్ కొనసాగుతుంది.

Latest news