ఒకప్పుడు హీరోయిన్లు ప్రేమలో ఉన్నా.. డేటింగ్లో ఉన్నా కూడా బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడవారు కాదు. మీడియా వాళ్లు ఎన్ని ప్రశ్నలు అడిగినా.. ఎన్ని పుకార్లు వచ్చినా కూడా తాము సింగిల్ అని చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా తాము ప్రేమలో ఉన్నామని.. డేటింగ్ చేస్తున్నామని చెప్పుకునేందుకే ఇష్టపడుతోన్న పరిస్థితి ఉంది. తాము ఎంత మాత్రం సింగిల్ కాదని.. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయామని చెప్పుకునేందుకే ఇష్టపడుతున్నారు.
రెండు రోజుల క్రితం అనుపమ పరమేశ్వరన్ బాంబ్ పేల్చింది. చూడడానికి చాలా క్యూట్‌గా, ఏం తెలియనట్టు కనిపించే ఈ అమ్ముడు చేసిన ప్రకటనతో అందరూ అవాక్కయ్యారు. అయితే తనది ప్రస్తుతానికి వన్ సైడ్ లవ్వేనని.. అటు నుంచి సిగ్నల్స్ వచ్చిన వెంటనే.. తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయిన సోషల్ మీడియా సంచలనం మీరాచోప్రా సైతం తన పెళ్లిపై స్పందించి.. తాను సింగిల్ కాదని చెప్పింది. ఈ యేడాదిలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ షాక్ ఇచ్చి.. తనకు కాబోయే వాడు ఎవ్వడు అన్నది మాత్రం దాచేసింది. ఇక మరో అందాల తార కృతీసనన్ సైతం తాను సింగిల్ కాదని.. అంతకు మించి అడగవద్దని చెప్పేసింది. ఇక పాయల్ అయితే ఏకంగా తన భాయ్ఫ్రెండ్స్ను వెంటేసుకుని మరీ షూటింగ్‌లకు వచ్చేస్తోంది.
మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తాను ప్రేమలో పడినట్టే ఉందని.. ఒకరికి బాగా దగ్గరయ్యానని చెప్పేసింది. ఇక తాజాగా టాలీవుడ్ నటి పూర్ణ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న విషయం స్వయంగా ప్రకటించింది. దుబాయ్‌కు చెందిన బిజినెస్ కన్సల్టెంట్ షనిద్ అసిఫ్‌ను త్వరలోనే పూర్ణ పెళ్లి చేసుకోబోతోంది. పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసిమ్.
ఆమె తెలుగులో ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నా సరైన గుర్తింపు రాలేదు. తాజాగా బాలయ్య అఖండ సినిమాలో మంచి పాత్రే చేసింది. ఇక బుల్లితెరపై జడ్జ్‌గా చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇలా చాలా మంది హీరోయిన్లు మొత్తానికి తాము సింగిల్ కాదని.. ప్రేమ, పెళ్లికి రెడీగా ఉన్నామని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు.