MoviesOfficial: నటి పూర్ణ నిశ్చితార్ధం అయిపోయిందోచ్ ..మంచి సౌండ్ పార్టినే పట్టిందే..!!

Official: నటి పూర్ణ నిశ్చితార్ధం అయిపోయిందోచ్ ..మంచి సౌండ్ పార్టినే పట్టిందే..!!

పూర్ణ.. ఈ పేరుకు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఒక్కప్పుడు ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు ఏమో .. కానీ, ఢీ షో పుణ్యమా అంటూ.. ఇప్పుడు ఈ అమ్మడు పేరు చెప్పితే కుర్రకారు ఊగిపోతున్నారు. ఆ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది అమ్మడు. అందానికి అందం నటనకి నటన.. తన అభినయంతో యూవతని కట్టిపడేసింది. టాలీవుడ్ హీరోయిన్స్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వారిలో పూర్ణ ఒకరు. ఈ అమ్మడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది. అఖండ సినిమా లో అమ్మడు నటనకి అందరు ఫిదా అయ్యారు.

హీరోయిన్ అవ్వాలని ఆశ పడి ఇండస్ట్రీకి వచ్చినా..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ అందుకుంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పూర్ణ…ఆ తరువాత చాలా సినిమాలు చేసింది. కానీ, ఏవి పెద్ద గా సక్సెస్ కాలేదు. నిజానికి ఆమె అసలు పేరు షామ్నా ఖాసిమ్. పూర్ణ అవ్వడానికి మలయాళీ భామ అయిన.. తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ అలరిస్తోంది. పూర్ణ తెలుగులో ఎక్కువుగా దర్శకుడు రవిబాబు సినిమాల్లో నటించి..అప్పట్లో హాట్ టాపిక్ గా మిలిచింది.

అయితేం ప్రస్తుతం సినిమాల్లో పాటు..ఈవెంట్స్ లో, కొన్ని ప్రోగ్రామ్‌స్ లో పాల్గోటూ బిజీ గా ఉన్న ఈ బ్యూటీ అభిమానులకు షాక్ ఇచ్చింది. తన కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటో ను పోస్ట్ చేస్తూ..నిశ్చితారధం అయిపోయిందంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమె కాబోయే భర్త పేరు..షానిద్‌ గా తెలుస్తుంది. ఈయన ఓ బడా వ్యాపారవేత్త అంటూ వార్తలు లీక్ అయ్యాయి. జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలను స్థాపించిన ఆయన వాటికి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. బాగా డబ్బున్న వ్యక్తిగా తెలుస్తుంది. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను” అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్‌ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు అయితే, మంచి సౌండ్ ఓఅర్టీనే పట్టావు పూర్ణ అంటూ కామెంత్స్ చేస్తున్నారు. కొందరు జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ..చెప్పుకొస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news