Moviesముగ్గురు విలన్లు, ఇద్దరు హీరోలు..మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్‌డేట్..!!

ముగ్గురు విలన్లు, ఇద్దరు హీరోలు..మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్‌డేట్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా “సర్కార్ వారి పాట” అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను ఆయన ఖాతాలో వేసుకుని..ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రజెంట్ త్రివిక్రమ్ తో ఓ సినిమాకు కమిట్ అయిన మహేశ్ బాబు..త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పై కి తీసుకెళ్ళనున్నాడు. ఈ సినిమా ఏడెనిమిది నెల‌ల పాటు షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని తెలుస్తోంది. అంటే ద‌స‌రాకు మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా నుంచి కూడా ఫ్రీ అయిపోతాడ‌ని అంటున్నారు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి సినిమాకు త‌న కాల్షీట్లు ఇస్తాడు మహేశ్. మహేష్ బాబు-త్రివిక్రమ్ ల కాంబో పై అభిమానులకి భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

గతంలో వచ్చిన ఖలేజా, అతడు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద మ్మచి విజయం అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ సినిమా రికార్డులను బీట్ చేసేలా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట డైరెక్టర్.చాలా కాలం త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి చేస్తోన్న సినిమా కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇది కీల‌క‌మైన టెక్నిక‌ల్ కాస్ట్‌.. స్టార్ కాస్ట్ ఈ వ‌ర‌కే ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా లో విల‌న్ గా మాత్రం ఇంకా ఎవ్వరిని సెట్ చేయలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, త్రివిక్రమ్ రాసుకున్న కధ ప్రకారం..ఈ సినిమాలో ముగ్గురు విలన్లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

సినిమాలో హీరో తగ్గ రేంజ్ లోనే విలన్ లకి నటించే స్కోఫ్ ఉండబోతుందట. సినిమాలో మ‌హేష్‌కు ధీటుగా న‌టించే ప్ర‌తినాయ‌కుడి కోసం త్రివిక్ర‌మ్ జల్లెడ పట్టి మరి వెతికి..ఫైనల్ గా ముగ్గురిని సెలక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది.సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు మ‌హేష్ 28వ చిత్రంలో విల‌న్‌గా .. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి.. మ‌రొక‌రు మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్‌.. మూడో విలన్ గా మల‌యాళంలో మ‌రో స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమార్‌..ని ఫైనల్ చేసిన్నట్లు తెలుస్తుంది.

 

ముగ్గురు అన్నదమ్ముల పాత్రలో నటించబోతున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని కూడా నటించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజా ఇప్పటి కే సెలక్ట్ అవ్వగా.. రెండో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదిఏమైనా త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్..మరి చూడాలి ఎలా వర్క్ అవుట్ అవుతుందో ఇది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news