Moviesసినీ ఫంక్షన్ లు కర్నూల్ వైపు మళ్లడానికి కారణం ఇదే..?

సినీ ఫంక్షన్ లు కర్నూల్ వైపు మళ్లడానికి కారణం ఇదే..?

ఒక్కప్పుడు అంటే లేవు కానీ, ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో కొత్తగా కొన్ని పద్ధతులు నేర్చుకున్నారు. సినిమా మొదలు ..ఫస్ట్ లుక్ అని, ఫస్ట్ గ్లింప్స్ అని, టీజర్ అని,ట్రైలర్ ఈవెంట్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లని, సక్సెస్ మీట్ లని అబ్బో..ఒకటా..రెండా..సినిమా మొదలు పెడితే ఫంక్షన్ లే ఫంక్షన్లు. అయితే, ఏ సినిమా అయిన..ఫంక్షన్ అంటే ముందుగా గుర్తు వచ్చేది..హైదరాబాద్. అందరికి దగ్గర..చాలా మంది స్టార్స్ ఉండేది కూడా ఇక్కడే. సో, 80% ఫంక్షన్లని ఇక్కడే పెట్టుకోవడానికి చూస్తుంటారు జనాలు.


అయితే, తెలంగాణ , ఏపీ డివైడ్ అయ్యాక..కొన్ని ఫంక్షన్ లు వైజగ్ లో కూడా పెట్టుకుంటున్నారు. టూరిస్ట్ ప్లేస్, గ్రీనరి..పైగా ఏపీ కి రాజధాని గా వైజాగ్ ని చెయ్యాలని చూశారు ఏపి CM. దీంతో కొన్ని సినిమా ఫంఫంక్షన్ లు అక్కడ కూడా జరిపారు. కాగా, గత కొన్ని నెలలు నుండి..సినీ ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్ కొన్ని..కర్నూలులో జరుపుతున్నారు. నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమా సక్సెస్ మీట్ మొదలు..మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా సక్సెస్ మీట్..నిన్న కాక మొన్న రిలీజ్ అయిన “విరాటపర్వం” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అన్ని కూడా..కర్నూలు లోనే జరిగాయి.

దీంతో, సడెన్ గా ఇండస్ట్రీ చూపు కర్నూలు వైపు మళ్లడం ఏంటా అని కొందరు జనాలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే షాకింగ్ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఆంధ్ర , తెలంగాణ లోనే ఇలా ఇండస్ట్రీ అంకితమైపోతే..రాయలసీమ వాళ్ళు ఫీల్ అవుతారని..ఇలా చేశారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.

మరికొందరు, హైదరబాద్, వైజాగ్ లతో పోలిస్తే..కర్నూలు లో ఖర్చు తక్కువ..పైగా అక్కడ జనాలకు సినిమాలు అంటే అదో ప్రత్యేకమైన అభిమానం..అందుకే అక్కడ ఫంక్షన్లు పెట్టుకుంటే..పబ్లిసిటీ వస్తుంది..ఖర్చు తగ్గుతుంది..అంటూ చెప్పుకొస్తున్నారు. విరాటపర్వ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో అంత పెద్ద వర్షం పడ్డా..ఒక్క అభిమాని కూడా అక్కడ నుండి కదలలేదు..దీని బట్టి వాళ్ళు సినిమాను ఎంత ప్రేమిస్తారో అర్ధం చేసుకోండి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news