Moviesలక్కి డైరెక్టర్ నే లాక్ చేసిన పూజా..ఇండస్ట్రీ కళ్లన్ని ఆయన వైపే..?

లక్కి డైరెక్టర్ నే లాక్ చేసిన పూజా..ఇండస్ట్రీ కళ్లన్ని ఆయన వైపే..?

టాలీవుడ్ బుట్టబొమ్మ గా సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న పూజా హెగ్డే..అందాలు గురించి ఎంత చెప్పిన తక్కువే. సినిమాలు ఫ్లాప్ అయినా..అమ్మడు అందాల కోసమే సినిమాకు వెళ్లిన జనాలు చాలా మందే ఉన్నారు. ప్రజెంట్ పూజా..టాలీవుడ్,బాలీవుడ్, కోలీవుడ్..లో సత్తా చాటుతూ వరుస సినిమాలకు సైన్ చేస్తూ…బిజీ బిజీ గా ఉంది. అయితే, రీసెంట్ గా ఆమె వరుస ఫ్లాప్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది. బిగ్ స్టార్స్ తో హ్యాట్రిక్ ఫ్లాప్ కొట్టిన పూజా మళ్ళీ ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకుంటుంది.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్..కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తో నటించిన బీస్ట్..మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ నటించిన ఆచార్య..ఇలా వరుస స్టార్ హీరో సినిమాల్లో నటించి..బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కానీ, ఎన్ని ఫ్లాప్ సినిమాలు పడినా పూజా రేంజ్, క్రేజ్ తగ్గలేదు. స్టార్ డైరెక్టర్ల మొదలు..నిన్న కాక మొన్న వచ్చిన డైరెక్టర్లకి, హీరోలకి కూడా పూజా హెగ్డేనే కావాలి అంటూ ఆమె కాల్ షీట్స్ కోసం ఎగబడుతున్నారు.

 

ఈ క్రమంలోనే పూజాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మనకు తెలిసిందే..పూజా , మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం అమ్మడు తన రెమ్యూనరేషన్ ని కూడా తగ్గించుకుందట. త్రివిక్రమ్ తనకు రెండు హిట్లు ఇచ్చాడనే నమ్మకంతోనే అమ్మడు ఈ సినిమా సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది.

కష్టాలల్లో ఉన్నప్పుడు పూజాని ఆదుకుంది అరవింద వీర రాఘవ సమేత, అల వైకుంఠపురం సినిమాలే. అస్సలు పూజా పూర్తి స్టోరీ వినకుండానే..త్రివిక్రమ్ ను బ్లైండ్ గా నమ్మేసి..సినిమాకి సైన్ చేసిందట. ప్రజెంట్ పూజాకి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా ఫ్లాప్ అయినా..ఆమెకు పేరు రాకపోయినా..ఇండస్ట్రీలో గడ్డు రోజులు ఎదురుకోవాల్సి వస్తుంది పూజా అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు ఈ సినిమా ఫ్లాప్ అయితే..స్టార్స్ ఆమెను అవాయిడ్ చేయడం పక్కా అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. మరి పూజా తలరాతను గురూజీ మారుస్తాడో లేదో చూడాలి..?

Latest news