టాలీవుడ్ రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడు. రెండు దశాబ్దాల నుంచి దేవిశ్రీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే వస్తోంది. గత రెండు, మూడేళ్లుగా దేవిశ్రీ పని అయిపోయిందని అనుకుంటోన్న ప్రతిసారి హిట్ కొడుతూ తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అంతా థమన్ మానియా నడుస్తోంది. ఈ టైంలో కూడా పుష్ప సినిమాతో దేవిశ్రీ రేంజ్ అంటే ఇదిరా అని ఫ్రూవ్ చేసుకున్నాడు.
దేవి 16 ఏళ్ల వయస్సులోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి అందరూ షాక్ అయిపోయే రేంజ్‌లో బిజీఎం ఇచ్చాడు. అంత చిన్న వయస్సులో కుర్రాడు అంత బ్లాక్‌బస్టర్ సినిమాకు ఆ రేంజ్‌లో అదరగొట్టే మ్యూజిక్ ఇవ్వడం ఏంటా ? అని మెస్మరైజ్ అయిపోయారు. అసలు దేవిశ్రీకి 15 ఏళ్లకే దేవి సినిమాకు మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ ఎలా ? వచ్చింది ? ఆ కథేంటో చూస్తే చాలా ఇంట్రస్టింగ్ అనిపిస్తుంది.
సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎంఎస్. రాజు ఓ సారి దేవిశ్రీ ఇంటికి వర్షంలో వెళ్లాడట. దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి రచయిత. బాలయ్య భలేదొంగ లాంటి సినిమాలకు కథ ఇచ్చింది ఆయనే. సత్యమూర్తి ఎంఎస్. రాజు బ్యానర్లో వచ్చే సినిమాలకు కూడా రచయితగా ఉండేవారు. ఆయన కోసం రాజు వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఓ గదిలో నుంచి ఫియానో సౌండ్ వస్తోందట. ఆయన ఆ గది దగ్గరకు వెళ్లి తలుపు తీసుకుని వెళితే లోపల దేవిశ్రీ ఫియానో వాయించుకుంటున్నాడట.
ఎంఎస్. రాజును చూసి అంకుల్ రండి కూర్చోమని చెప్పాడట. వెంటనే రాజు ఓ సందర్భం చెప్పి దీనికి నాకు మ్యూజిక్ కంపోజింగ్ చేసి ఇవ్వమని వెళ్లిపోయాడట. తర్వాత రెండు రోజులకు దేవీ ఫోన్ చేసి అంకుల్ ఆ కంపోజ్ రెడీ అయిపోయింది.. తీసుకు రమ్మంటారా ? అని అడిగాడట. అయితే రాజు నేను వస్తానని చెప్పారట. ఓ వైపు భోరున వర్షం కురుస్తున్నా కూడా దేవి ఇంటికి బయలు దేరారట.
చెన్నైలో సాలిగ్రామం ఏరియాలో ఉంటోన్న దేవి ఇంటికి వెళుతుండగా.. కారు నీళ్లలో మునిగిపోయి స్టార్ట్ అవ్వలేదట. ఇదేం అపశకునం వెనక్కు వెళ్లిపోదామా ? అనుకుని కూడా ఎంఎస్. రాజు కిలోమీటర్ మేర నీళ్లలో నడుచుకుంటూ దేవి ఇంటికి వెళ్లారట. దేవి ఆ ట్యూన్ వినిపించిన వెంటనే ఎంఎస్. రాజుకు మైండ్ బ్లాక్ అయిపోయిందట. వెంటనే దేవీ సినిమాకు నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేశారట.
అలా దేవి తన తొలి సినిమాతోనే తానేంటో ఫ్రూవ్ చేసుకుని.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. రీసెంట్‌గా రాజు బర్త్ డే జరిగినప్పుడు దేవి వీడియో కాల్ చేసి అక్కడ తన టీంతో హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడి విష్ చేయడంతో పాటు అక్కడ కేక్ కట్ చేయించి మరీ తన బర్త్ డే వినూత్నంగా సెలబ్రేట్ చేశాడని ఎంఎస్. రాజు ఓ ఇంటర్వ్యూలో దేవిని మెచ్చుకున్నాడు.