Moviesబాల‌య్య‌ను దర్శక, నిర్మాతలు అమితంగా ఇష్టపడటానికి ఆ రెండు క్వాలిటీసే కారణం..!

బాల‌య్య‌ను దర్శక, నిర్మాతలు అమితంగా ఇష్టపడటానికి ఆ రెండు క్వాలిటీసే కారణం..!

నట సింహం నందమూరి బాలకృష్ణ అంటే పౌరాణికం, చారిత్రకం, సోషల్ మూవీస్..ఇలా ఏ జోనర్‌లో అయినా సినిమా చేసే సత్తా ఉన్న హీరో. పాత్ర ఎలాంటిసైనా మేకప్ వేసుకుంటే నేను బాలకృష్ణను అని మర్చిపోతారు. పాత్రలో మాత్రమే లీనమై ఉంటారు. ఒకదశలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఫ్యాక్షన్ కథలు వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయంటే అది బాలయ్య వల్లనే అని ఎవరైనా ఒప్పుకోవాలి. బాలయ్యకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన సమరసింహారెడ్డి ఒక ట్రెండ్ సెట్టర్.

పరుచూరి బ్రదర్స్ రాసిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమా రేంజ్‌ను పెంచితే..బాలయ్య టైటిల్ రోల్‌లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై అదరగొట్టారు. సమరసింహారెడ్డి ప్రదర్శించిన థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. సాంగ్స్ పరంగా మణిశర్మ అందించిన ఆల్బం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో బాలయ్య చెప్పే డైలాగ్స్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయ్తాయి. ఇక సమరసింహా రెడ్డి సినిమా తర్వాత తెలుగులో చాలా ఏళ్ళు ఇదే ట్రెండ్ కొనసాగింది.

చిరంజీవి ఇంద్ర అని, వెంకటేశ్ జయం మనదేరా అని, నాగార్జున ఎదురులేని మనిషి, మోహన్ బాబు రాయలసీమ రామన్న చౌదరీ అంటూ సినిమాలు చేశారు. సీనియర్ హీరోలే కాదు, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లాంటి వారు కూడా ఆది, సింహాద్రి లాంటి సినిమాలు చేసి భారీ హిట్ సాధించారు. అయితే ఫ్యాక్షన్ సినిమాలు నందమూరి హీరోలకు సూటయినట్టుగా మిగతా హీరోలకు సూటవలేదనేది ఒప్పుకోరుగానీ, ఒప్పుకొని తీరాల్సిందే.

అయితే, అది ఫ్యాక్షన్ స్టోరి గానీ, ఫిక్షన్ స్టోరీ గానీ, ఒక్కసారి బాలయ్య దర్శకనిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చక చకా షూటింగ్ జరిగి నాలుగైదు నెలల్లో థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందే. అంటే బాలయ్య అసలు దర్శకుడి విషయంలో జోక్యం చేసుకోరు. కథ లాక్ అయ్యాక దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్ళడమే. ఇక బాలయ్యలో ఉన్న మరో గొప్ప క్వాలిటీ ..కథకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టమని నిర్మాతకు గట్టిగా సినిమా మొదలయ్యేటప్పుడే చెప్పేస్తారు. పొరపాటున కూడా బడ్జెట్ లిమిట్ క్రాస్ అవనీయరు..అయితే ఒప్పుకోరు.

అఖండ ఇంత ఘన విజయం సాధించడానికి ఇదే ముఖ్య కారణం. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి అప్పటికే బోయపాటితో జయ జానకీ నాయక చేసి నష్టాలలో ఉన్నాడు. అయినా బాలయ్య – బోయపాటిల మీద నమ్మకంతో అఖండ సినిమాను నిర్మించాడు. బాలయ్య చాలా కంట్రోల్‌గా సినిమాను తీద్దామని చెప్పి అలాగే తీశారు. సినిమా ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే, దర్శకనిర్మాతలకు బాలయ్య అంటే చెప్పలేని అభిమానం. ఆయనతో ఎప్పుడు సినిమా చేసేందుకైనా రెడీగా ఉంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news