కరోనాకు ముందు వరకు పెళ్లంటే దూరం దూరం అంటూ జరిగిన సెలబ్రిటీలు ఇప్పుడు ఒక్కొక్కరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కరోనా లాక్ డౌన్ టైంలో చాలా మంది సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. అటు హీరోలు, ఇటు హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కేసి తమ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కరోనా తర్వాత కూడా కొందరు పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కరోనా థర్డ్ వేవ్ ముగిశాక అందరికి షాక్ ఇస్తూ ఓ హీరో, హీరోయిన్ దంపతులు అవ్వడంతో పాటు కొత్త జీవితం స్టార్ట్ చేశారు. వాళ్లే ఆది పినిశెట్టి, నిక్రీ గల్రానీ.
సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి హీరోగా, విలన్గా ఎన్నో సినిమాలు చేశాడు. ఇక కన్నడ నటి, ప్రభాస్ బుజ్జిగాడు ఫేం సంజనా గల్రానీ సోదరి అయిన నిక్కీ గల్రానీకూడా తెలుగు, తమిళ్లో కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ టైంలో ఆది, నిక్కీ మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇక తన జ్యోతిష్యాలతో కలకలం రేపుతోన్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తాజాగా ఈ సెలబ్రిటీ దంపతుల వైవాహిక జీవితంపై పెద్ద బాంబే పేల్చాడు. ఆది పినిశెట్టిది అశ్లేష నక్షత్రం అని.. అతడిది, నిక్కీ జాతాకాన్ని పోల్చి చూసినప్పుడు షష్టాష్టకాలు ఉండడంతో వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని వేణుస్వామి చెప్పాడు. వాళ్లిద్దరి భవిష్యత్తు గురించి తనకు అవగాహన ఉందని.. వాళ్లు విడిపోవాలని తాను చెప్పడం లేదని.. అయితే జాతకాల ప్రకారం షష్టాష్టకాలు ఉంటే పెళ్లికి దూరంగా ఉంటేనే మంచిదని ఆయన చెప్పారు.
వీళ్లిద్దరు ప్రేమ అనే పిచ్చి మూర్ఖత్వంతో పెళ్లి చేసుకున్నారు అని.. జాతకాల రీత్యా వీరు తర్వాత విడిపోతే సమాజానికి ఏమని ఆన్సర్ ఇస్తారని వేణుస్వామి ప్రశ్నించారు. అయితే జాతకాల పరంగా విశ్లేషణలు చేసుకుని పరిహారం పొందితే ఫలితం ఉంటుందని కూడా సలహా ఇచ్చాడు. గతంలో కొందరు సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి చేసిన కామెంట్లు నిజం కావడంతో ఇప్పుడు ఈ జంట విషయంలో చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.
సమంత – చైతు జంట కూడా విడిపోతారని వేణుస్వామి ముందే చెప్పగా అదే నిజం అయ్యింది. దీంతో ఇప్పుడు ఆది – నిక్కీ విషయంలో వేణుస్వామి మాటలు మరోసారి నిజంగానే నిజం అవుతాయా ? లేదా వాళ్లు వీటిని బ్రేక్ చేస్తారా ? అన్నది కాలమే నిర్ణయించాలి.